RS Praveen Kumar : తెలంగాణ ప్రస్తుతం మరణశయ్యపై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. ఇందుకేనా మనం తెచ్చుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు.
దోపిడీదారులకు అడ్డాగా మారిందని నిప్పులు చెరిగారు. అపారమైన వనరులు, వసతులు కలిగిన ఈ ప్రాంతం కొంతమంది చేతుల్లో బందీగా మారి పోయిందని మండిపడ్డారు.
త్యాగాలకు సిద్దం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేదలు, బడుగులు, బహుజనులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల పరిస్థితి దయనీయంగా మారిందని ఈ తరుణంలో సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్పీ(RS Praveen Kumar).
బీసీలతో పాటు మైనార్టీల సమాజం కూడా అత్యంత ప్రమాదంలో ఉందని హెచ్చరించారు. ఓటు అన్నది అత్యంత విలువైనదని దానిని మన బాగు కోసం ఉపయోగించు కోవాలని అన్నారు.
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీలన్నీ ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయని ధ్వజమెత్తారు. తాను ఏ కులానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
సమాజంలో 75 శాతం సంపద కేవలం 10 మంది చేతుల్లోనే ఉందని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. మరి ఆ పది మంది చేతుల్లో ఉన్న సంపదను పేదలకు ఎందుకు పంచడం లేదని నిలదీశారు.
విలువైన భూములను అప్పనంగా తమ వారి కట్ట బెడుతున్నారని దీనిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. బహుజన రాజ్యం వస్తేనే మన బతుకులు బాగు పడుతాయని(RS Praveen Kumar) అన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి అన్నది ప్రధాన లక్ష్యమని చెప్పారు ఆర్ఎస్పీ. రాష్ట్రంలో నిరుద్యోగులు ఓ వైపు రైతులు మరో వైపు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించు కోవడం లేదన్నారు.
Also Read : పార్టీని వీడడం ఖాయం – జగ్గారెడ్డి