RS Praveen Kumar : ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారా – ఆర్ఎస్పీ
మంత్రి పువ్వాడ అజయ్ పై ఆగ్రహం
RS Praveen Kumar : తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అక్రమాలను బయట పెట్టిన సమాచార హక్కు చట్టం కార్యకర్త కోయిని వెంకన్నపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. జైలుకు పంపించారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్యాయాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరికీ బీఎస్పీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). పువ్వాడ అజయ్ పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న గూండా గిరికి వ్యతిరేకంగా చివరి దాకా బీఎస్పీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు బీఎస్పీ చీఫ్.
భారత రాష్ట్ర సమితి పార్టీ గూండాలకు కేరాఫ్ గా మారిందని మండిపడ్డారు. ప్రశ్నించడాన్ని తట్టుకోలేక పోతున్నారని రాబోయే రోజుల్లో ప్రజల చేతుల్లో చావు దెబ్బలు తినక తప్పదని హెచ్చరించారు. ఇప్పటి వరకు కోరి కొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. సంబండ వర్ణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తూ , గూండా గిరీకి అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. వీరి ఆగడాలను ఇక సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
Also Read : Bhatti Vikramarka : ప్రజలతో మమేకం పుస్తకాలతో నేస్తం
