RS Praveen Kumar : దొర భూ దాహం తెలంగాణకు శాపం
కేటాయింపుపై ఆర్ఎస్పీ ఫైర్
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆఫీసుకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన సీఎంపై నిప్పులు చెరిగారు. బహిరంగ మార్కెట్ లో ఈ భూమి విలువ దాదాపు రూ. 500 కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొన్నారు ఆర్ఎస్పీ. కానీ కేసీఆర్ భూ దాహం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేవలం రూ. 3.41 కోట్లకు కొనుగోలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
నియంత పాలనకు ఇది ఓ పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. రహస్యంగా జీవో తీసి ఆ వెంటనే దొడ్డి దారిన చౌకగా చేజిక్కించు కోవడం కేసీఆర్ కే చెల్లిందన్నారు బీఎస్పీ చీఫ్. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన పాలకులే భక్షకులైతే ఎలా అని ప్రశ్నించారు. నిస్సిగ్గుగా ఇలాంటి అక్రమాలకు, దురాక్రమణలకు పాల్పడితే ఎలా అని నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
బినామీ కంపెనీలకు కట్టబెట్టడం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం , కోట్ల ప్రజా ధనాన్ని లూటీ చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్, బీజేపీ రహస్య కూటమిని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో భయంకరమైన భూ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ఈ పోర్టల్ మొత్తం సీఎం పుత్రరత్నం అంటూ ఎద్దేవా చేశారు బీఎస్పీ చీఫ్. కేసీఆర్ భూదాహానికి లక్షలాది పేద, మధ్య తరగతి ప్రజల భూములు కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Foxconn Drops : ఫాక్స్ కాన్ షాక్ వేదాంతకు ఝలక్