RS Praveen Kumar KCR : అమ‌రుల కుటుంబాల‌కు గుర్తింపేది

సీఎం కేసీఆర్ ను నిల‌దీసిన ఆర్ఎస్పీ

RS Praveen Kumar KCR : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. గురువారం ట్విట్ట‌ర్ వేదికగా సీరియ‌స్ గా స్పందించారు. ఆయ‌న కేసీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ మ‌లి ద‌శ ఉద్య‌మంలో 1200 మంది అమ‌ల‌రులు అయ్యారంటూ సీఎం చెబుతున్నార‌ని , మ‌రి వారిని ఎందుకు గుర్తించ లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఏర్ప‌డి తొమ్మిదేళ్ల‌వుతోంది. ఎందుకు గుర్తించ‌డంలో ఆల‌స్యం జ‌రిగింద‌ని నిల‌దీశారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్పుడే అమ‌రులు, వారి కుటుంబాలు గుర్తుకు వ‌చ్చాయా అని సీఎంపై మండిప‌డ్డారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

హుస్సేన్ సాగ‌ర్ స‌మీపంలో తెలంగాణ అమ‌ర వీరుల స్మార‌క స్థూపాన్ని నిర్మించింది ఎవ‌ర‌న్నారు. దీనిని నిర్మించేందుకు తెలంగాణ నుంచి ఒక్క నిర్మాణ కంపెనీ ముందుకు రాలేదా లేక 30 శాతం క‌మీష‌న్ రాద‌ని టెండ‌ర్ ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ కు అప్ప‌గించారా అని నిల‌దీశారు. కేపీసీ ప్రాజెక్టు లిమిటెడ్ క‌ట్టిన ఈ స్థూపంతో వంద‌లాది మంది అమ‌రుల ఆత్మ‌లు ఘోషిస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar).

మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మంలో తొలి అమ‌రుడు శ్రీ‌కాంతాచారి ప్రాణ త్యాగం చేసింది ఇందు కోస‌మేనా , 60 ఏళ్లుగా ఆంధ్రోళ్ల‌తో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇదేనా అని నిప్పులు చెరిగారు. ఉస్మానియా, కాక‌తీయ విద్యార్థులు బ‌లిదానాలు చేసుకుంది ఇందుకేనా అని వాపోయారు. త్యాగాలు, బ‌లిదానాల పేరుతో గ‌ద్దెనెక్కిన కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక మ‌రిచి పోయాడంటూ మండిప‌డ్డారు. దోపిడీ పాల‌న సాగిస్తున్న నీకు బుద్ది చెప్పే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు .

Also Read : Lokesh Kanagaraj LEO : లియోపై భారీ అంచ‌నాలు

Leave A Reply

Your Email Id will not be published!