RS Praveen Kumar : గాడి తప్పిన పాలన జనం ఆవేదన
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం పేరుతో ప్రజా సమస్యలను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి అటకెక్కిందని ఆరోపించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పాలనా తీరుపై ఫైర్ అయ్యార్ ఆర్ఎస్పీ(RS Praveen Kumar).
ప్రజలు చూసేందుకు సచివాలయం అందంగా కనిపిస్తోందని కానీ కొలువు తీరి 9 ఏళ్లవుతున్నా నేటికీ ఒక్క హామీ కూడా ఆచరణకు నోచుకోలేదని మండిపడ్డారు బీఎస్పీ చీఫ్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టం తప్ప రైతులకు, తెలంగాణకు ఒనగూరింది ఏమీ లేదన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ వల్ల బతుకులు బాగుపడిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
సీఎం కనుసన్నలలో పడేందుకు రాష్ట్ర మంత్రివర్గం , ఎమ్మెల్యేలు నానా తంటాలు పడ్డారని, ఒక రకంగా ఇది దొరల సంస్కృతిని తెలియ చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని గుర్తు పెట్టుకోవాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వ్యవస్థలను నిర్వీర్యం చేసి సమస్యలను పరిష్కరించకుండా ఉన్నంత మాత్రాన జనం ఆదరించరని , గుర్తు పెట్టు కోవాలని హెచ్చరించారు.
ఓఆర్ఆర్ కాంట్రాక్టు అప్పనంగా తక్కువ ధరకు ఎలా కట్ట బెడతారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. రహస్యంగా జీవోలు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ నిప్పులు చెరిగారు. అసైన్డ్ భూములు అమ్ముకునే హక్కు ఎవరు ఇచ్చారంటూ ధ్వజమెత్తారు.
Also Read : మోదీపై అరవింద్ కేజ్రీవాల్ గుస్సా