RS Praveen Kumar : అమరులకు జోహార్లు – ఆర్ఎస్పీ
తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు
RS Praveen Kumar : నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణ ఏర్పడి నేటితో 9 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. అధికారం మారింది, రాష్ట్రం ఏర్పడింది కానీ సమస్యలు అలాగే ఉన్నాయి. పేదల కష్టాలు పోవాలంటే బహుజన రాజ్యం రావాలని ఆకాంక్షించారు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగౌళిక తెలంగాణ ఏర్పడింది కానీ బహుజన తెలంగాణ రాలేదని ఆవేదన చెందారు బీఎస్పీ చీఫ్. మనందరం ఇకనైనా మేలు కోవాలని, ఓట్లు అమ్ము కోవద్దని పిలుపునిచ్చారు. ఓటు వజ్రాయుధమని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటల్ని మనందరం విశ్వసించాలని , ప్రతిజ్ఞ చేయాలని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజన రాజ్యం ఏర్పడాలంటే పేదలు, నిరుద్యోగులు, మహిళలు, యువత ఒక్కసారి ఆలోచించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో బలిదానం చేసుకున్నారు. వారు చేసిన త్యాగం వెల కట్టలేనిది. చరిత్ర ఉన్నంత వరకు వారు నిలిచే ఉంటారని పేర్కొన్నారు. వారు కన్న కలల్ని సాధించుకునే రోజు తప్పకుండా వస్తుందని, అది బీఎస్పీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు.
Also Read : TMC Rally
