Rushikonda Works : రుషికొండ నిర్మాణాలపై తనిఖీలు
ప్రారంభించిన నిపుణుల కమిటీ
Rushikonda Works : విశాఖపట్టణం – కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ రుషికొండ(Rushikonda) నిర్మాణాలపై తనిఖీలు స్టార్ట్ చేసింది. ఎలాంటి పర్మిషన్లు లేకుండా తవ్వకాలు, నిర్మాణాల్లో రూల్స్ కు విరుద్దంగా కొనసాగుతున్నాయంటూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
Rushikonda Works Observation
దీపిఐ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరక కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర కమిటీ విశాఖకు చేరుకుంది. నిజ నిర్దారణ చేపట్టింది.
ఇదే అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్టు ప్రాకరం రూల్స్ కు విరుద్దంగా ఉంటే సరి చేయాలని కోర్టు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. తాజాగా నియమించిన కమిటీ ప్రస్తుతం విశాఖకు చేరుకుంది. రుషికొండలో పర్యటించింది.
పర్యాటక శాఖ నిర్మిస్తున్న నిర్మాణాలు అనుమతి పొందిన వాటి కంటే ఎక్కువగా జరుగుతున్నాయని , కోస్టల్ రెగ్యులేషన్ రూల్స్ పాటించడం లేదంటూ హైకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. రుషి కొండపై కేంద్ర కమిటీ ఆరా తీయడంతో కలకలం రేపుతోంది.
Also Read : TTD Cancel : 19న బ్రేక్ దర్శనాలు రద్దు