Russia America : అమెరికాకు ర‌ష్యా ఝ‌ల‌క్

రాకెట్ ఇంజ‌న్ల స‌ర‌ఫ‌రాకు చెక్

Russia America  : ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. మ‌రో వైపు అమెరికా వ‌ర్సెస్ ర‌ష్యా గా మారింది. ఇదిలా ఉండ‌గా అమెరికాకు ర‌ష్యా ఝ‌ల‌క్ ఇస్తే ర‌ష్యాకు బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ వ‌న్ వెబ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది.

యుద్దం నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఐక్య రాజ్య స‌మితి, యూరోపియ‌న్ దేశాలు, బ్రిట‌న్, ఫ్రాన్స్ , అమెరికా(Russia America )ఆర్థిక ఆంక్ష‌లు విధించింది. దీనిని సీరియ‌స్ గా తీసుకుంది ర‌ష్యా. ఉక్రెయిన్ పై య‌ద్దం అమెరికా ర‌ష్యా మ‌ధ్య యుద్దంగా మారింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 2 వేల మందికి పైగా సాధార‌ణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భ‌వ‌నాలు దెబ్బ తిన్నాయి. ఈ స‌మ‌యంలో ర‌ష్యా ఉప్ర‌గ‌హాల ప్ర‌యోగాల‌ను పూర్తిగా నిలిపి వేస్తున్న‌ట్లు వ‌న్ వెబ్ స్ప‌ష్టం చేసింది.

అంతే కాకుండా క‌జ‌కిస్తాన్ నుంచి ప్ర‌యోగించే అన్ని ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాలు కూడా నిలిపి వేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా త‌మ దేశ అంత‌రిక్ష కేంద్రంనుంచి అమెరికా, బ్రిట‌న్ , జపాన్ దేశాల జాతీయ జెండాల‌ను తొల‌గించింది ర‌ష్యా.

మ‌రో వైపు భార‌త దేశానికి చెందిన జాతీయ జెండాను మాత్రం అలాగే ఉంచింది. ఇందులో భాగంగా ర‌ష్యా అంత‌రిక్ష ఏజెన్సీ చీఫ్ ద్విమిత్రి రోగోజిన్ దీనికి సంబంధించిన పూర్తి వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

విచిత్రం ఏమిటంటే కొన్ని దేశాలకు చెందిన జెండాలు లేక పోతే త‌మ అంత‌రిక్ష నౌకా కేంద్రం అద్భుతంగా, అందంగా క‌నిపిస్తోంద‌ని చెప్ప‌డం విశేషం.

ఇదిలా ఉండ‌గా అమెరికాకు రాకెట్ ఇంజ‌న్ల స‌ర‌ఫ‌రాను నిలిపి వేస్తున్న‌ట్లు ర‌ష్యా ప్ర‌క‌టించింది. త‌మ‌పై ఆర్థిక ఆంక్ష‌లు విధించ‌డంతో ర‌ష్యా ఈ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకుంది.

Also Read : చ‌ర్చ‌లు సాగేనా యుద్దం ముగిసేనా

Leave A Reply

Your Email Id will not be published!