Russia Civil War : రష్యాలో అంతర్యుద్ధం
యుఎస్ ఎంబసీ హెచ్చరిక
Russia Civil War : రష్యాలో సివిల్ వార్ (అంతర్యుద్దం) కొనసాగుతోంది. ఎక్కడ చూసినా రష్యా బలగాలకు మెర్సెనరీ గ్రూప్ వాగ్నెర్ చీఫ్ యోవ్జెనీ ప్రిగోజిన్ కు మధ్య యుద్దం జరుగుతోంది. ప్రస్తుతం ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇది ఎవరూ ఊహించని సన్నివేశానికి కేరాఫ్ గా మారింది రష్యా. మరో వైపు బెలారసియన్ చీఫ్ అలెగ్జాండర్ లుకాషెంకో వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా యుఎస్ ఎంబసీ భద్రతా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
సైనిక తిరుగుబాటుతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో రష్యా చీఫ్ పుతిన్(Vladimir Putin) ఉన్నట్లు సమాచారం. వాగ్నర్ గ్రూప్ హెచ్చరికల నేపథ్యంలో మాస్కో లోని భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. సైనిక హెలికాప్టర్లు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాయి. మాస్కో అంతటా లాక్ డౌన్ లోకి వెళ్లింది. 25,000 మంది కిరాయి దళం దేశ రాజధానిలో కవాతు చేస్తామని ఇప్పటికే బెదిరించింది.
రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా యెవ్జెనీ ప్రిగోజిన్ సారథ్యంలోని దళాలు తమ సోదరులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్దమయ్యాయి. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ నగరం రోస్టోవ్ లో చాలా వరకు తమ నియంత్రలోకి వచ్చిందని మిలీషఙయా ప్రకటించింది. దీంతో దేశం అంతర్యుద్దంలోకి వెళ్లే అవకాశం ఉందని పుతిన్ ఆందోళనకు గురయ్యారు.
Also Read : PM Modi Warm Welcome : ఈజిప్టులో మోదీకి గ్రాండ్ వెల్ కమ్