Denis Alipov : మోదీ కామెంట్స్ పై రష్యా స్పందన
ప్రపంచ మార్కెట్ కు చమురు నిలిపివేత
Denis Alipov : రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ పై భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. షాంఘై కోఆపరేషన్ కీలక భేటీలో ఉక్రెయిన్ పై రష్యా యుద్దాన్ని వెంటనే విరమించాలని కోరారు.
ఇది యుద్ద యుగం కాదన్నారు మోదీ. దీనిపై రష్యా ఘాటుగా స్పందించింది. పశ్చిమ దేశాలు ఇతర భాగాలను విస్మరిస్తూ తమకు సరిపోయే కోట్ లను మాత్రమే ఉపయోగిస్తాన్నారు భారత దేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్(Denis Alipov).
ఈ అంశంపై భారత దేశ వైఖరికి అనుగుంగా ఉన్నాయని చెప్పారు. శనివారం డెనిస్ అలిపోవ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదిలా ఉండగా జి-7 దేశాలు ప్రతిపాదించిన ధరల పరిమితి న్యాయంగా లేక పోతే ప్రపంచ మార్కెట్ కు చమురు సరఫరా నిలిపి వేస్తామని రష్యా ప్రకటించింది. ధరలు తమకు ఆమోద యోగ్యంగా లేవని పేర్కొనడాన్ని తప్పు పట్టారు.
యుఎస్ చొరవతో చేరిన దేశాలకు చమురు సరఫరాను బేషరతుగా నిలిపి వేవాస్తమని డెనిస్ అలిపోవ్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి మోదీ చసిన వ్యాఖ్యలను ప్రపంచ నాయకులలో ఒక వర్గం బహిరంగ మందలింపుగా భావించిందని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా రష్యా తన వాణిజ్య ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి యంత్రాంగాన్ని అనుసరించదని స్పష్టం చేశారు. ధరల పరిమితి గ్లోబల్ మార్కెట్లలో చమురు కొరతకు దారి తీస్తుందని , ధర గణనీయంగా పెరుగుతుందని అలిపోవ్(Denis Alipov) అన్నారు.
ఇదే సమయంలో పాకిస్తాన్ కు తాము ప్రయారిటీ ఇవ్వడ లేదని పేర్కొన్నారు అలిపోవ్.
Also Read : పాక్ ప్రధాని కామెంట్స్ పై భారత్ ఫైర్