Russia Fires Missiles : ఉక్రెయిన్ పై రెచ్చి పోయిన ర‌ష్యా

70కి పైగా క్షిప‌ణుల దాడి

Russia Fires Missiles : ర‌ష్యా త‌న తీరును మార్చు కోవ‌డం లేదు. ఉక్రెయిన్ త‌ల వంచ‌డం లేదు. దీంతో ఇరు దేశాల మ‌ధ్య యుద్దం మ‌రింత ఉధృతంగా మారింది. ఈ త‌రుణంలో శుక్ర‌వారం ఏక‌ధాటిగా దాడికి దిగింది రష్యా(Russia Fires Missiles). ఇప్ప‌టి వ‌ర‌కు ఉక్రెయిన్ పై ర‌ష్యా 70కి పైగా క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించింది.

తాజాగా సెంట్ర‌ల్ కివీ రిహ్ అపార్ట్ మెంట్ బ్లాక్ ను ఢీకొట్ట‌డంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ద‌క్షిణాన ఖెర్స‌న్ లో మ‌రొక‌రు మృతి చెందారు. దేశ వ్యాప్తంగా అల‌ర్ట్ గా ఉండ‌మ‌ని ఆదేశించారు ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ. ఆక్ర‌మిత తూర్పు ఉక్రెయిన్ లో ర‌ష్యా ఏర్పాటు చేసిన షెల్లింగ్ లో 12 మంది చ‌ని పోయిన‌ట్లు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది.

ఓ వైపు ప్ర‌పంచ‌మంతా దాడులు ఆపాల‌ని చేసినా ర‌ష్యా వినిపించు కోవ‌డం లేదు. మ‌రో వైపు దాడుల‌ను మ‌రింత ముమ్మ‌రం చేసింది. ఈ సంద‌ర్భంగా తాము లొంగిపోయే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు జెలెన్ స్కీ. ఆయ‌న వీడియో సందేశం ద్వారా ర‌ష్యా ఎలా ఏక‌ప‌క్షంగా దాడుల‌కు తెగ‌బ‌డిందో స్ప‌ష్టం చేశారు.

అయితే ర‌ష్యా వ‌ద్ద ఇంకా అనేక భారీ దాడుల‌కు స‌రిప‌డా క్షిప‌ణులు ఉన్నాయ‌ని అన్నారు. కైవ్ కు మ‌రింత మెరుగైన వాయు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని పాశ్చాత్య మిత్ర దేశాల‌ను జెలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్ తిరిగి పుంజుకునేంత బ‌లంగా ఉంద‌న్నారు.

ఎన్ని దాడుల‌కు తెగ‌బ‌డినా ఏ ఒక్క‌రు త‌ల వంచే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశాడు. అకార‌ణ యుద్దం అనివార్యంగా మార్చిన చ‌రిత్ర పుతిన్ కు ఉంద‌న్నారు. కానీ వాళ్లు ఎన్న‌డూ కైవ్ ను కైవ‌సం చేసుకోలేర‌న్నారు.

Also Read : ఐర్లాండ్ ప్ర‌ధానిగా లియో వ‌రాద్క‌ర్

Leave A Reply

Your Email Id will not be published!