Putin Ukraine : ప్రపంచంలో టెక్నాలజీ మారింది. తరాలు మారినా ఇంకా రాజ్య కాంక్ష మారలేదు. అది అక్టోపస్ లా కొనసాగుతూ వస్తోంది. రాసుకున్న రాజ్యాంగాలను పక్కన పెట్టేశారు.
ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు సైతం నిస్సిగ్గుగా చట్టాలను, విధి విధానాలను తుంగలో తొక్కుతున్నాయి. పవర్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ స్విస్ బ్యాంకుల్లోకి సంపదను తరలిస్తున్నారు.
ఇక ఒకప్పటి కమ్యూనిస్టు కంట్రీగా పేరొంది ఆ తర్వాత కుప్ప కూలి పోయాక ఏకాకిగా మిగిలి పోయిన రష్యా మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతోంది.
ఇప్పటికే అక్కడ ప్రతిపక్షం అన్నది లేకుండా చేసుకుంటూ వచ్చారు రష్యా చీఫ్ పుతిన్(Putin Ukraine). ప్రపంచం ఓ వైపు మొత్తుకుంటున్నా తన పట్టు వీడడం లేదు. శాంతి సమస్యకు పరిష్కారం కాదని యుద్దమే అన్నింటికీ ఆన్సర్ ఇస్తుందంటున్నారు.
తాజాగా ఉక్రెయిన్ పై యుద్ధం చేసేందుకు సై అంటున్నారు. ఇప్పటికే ఆ దేశ సరిహద్దు మొత్తం సైన్యాలతో , యుద్ధ ట్యాంకులతో, విమానాలతో నిండి పోయింది.
ఎప్పుడైనా కాల్పుల మోత మోగించేందుకు సన్నద్దమైంది రష్యా. పైకి కానే కాదంటున్నప్పటికీ దాడి చేసేందుకు డిసైడ్ అయ్యింది. ఫ్రాన్స్, జర్మనీ, నాటోతో పాటు భారత్ సైతం రష్యాను నియంత్రణ పాటించాలని కోరుతున్నాయి.
చివరకు అమెరికా చీఫ్ బైడెన్ పుతిన్ తో మాట్లాడేందుకు ఒప్పుకున్నారు. ప్రస్తుతానికి నిలిపి వేయాలని కోరుతున్నారు. కానీ రష్యా ఒప్పు కోవడం లేదు.
మరో వైపు గజం భూమిని వదులు కోమంటూ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు స్పష్టం చేశాడు. యుద్దానికి రెడీ అంటున్నారు. ఇంకొన్ని గంటలు వేచి చూస్తే కానీ తెలియదు ఏం జరుగుతుందనేది.
Also Read : తగ్గక పోతే తాట తీస్తాం – బైడెన్