Russia Ukraine : ఉక్రెయిన్ పై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్న రష్యా సంచలన ప్రకటన చేసింది. ఆ దేశ సైన్యం ఆయుధాలు వదిలేసి లొంగి పోతే తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని వెల్లడించింది.
యావత్ ప్రపంచమంతా నెత్తి నోరు మొత్తుకున్నా రష్యా తన పట్టు వీడలేదు. ఇప్పటికే సైనిక దళాలు విరుచుకు పడ్డాయి. ఇంకో వైపు బాంబుల మోత మోగుతోంది. క్షిపణుల దాడులతో అందమైన పర్యాటక నగరం నిర్మానుష్యంగా మారింది.
ఈ శతాబ్ధంలో అత్యంత హృదయ విదారకమైన ఘటనగా చెప్ప వచ్చు. ఇది పూర్తి స్థాయి యుద్ధం కాదని కేవలం సైనిక చర్య మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
ఇప్పటి వరకు కేపిటల్ సిటీని కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పెస్ట్ అఫెన్స్ ఎలక్ట్రానిక్ పెస్ట్ రిపెల్లెంట్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉక్రెయిన్ ఆర్మీ ఆయుధాలు వదిలేసి వస్తే మాట్లాడేందుకు సిద్దమని స్పష్టం చేసింది రష్యా ప్రభుత్వం(Russia Ukraine).
అయితే ఉక్రెయిన్ రాజధాని కైవ్ వెలుపల రష్యా దళాలతో తాము పోరాడుతూనే ఉన్నామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. కాగా ఒక్కసారి మాత్రమే ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలను వదులుకుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ ఇవాళ అన్నారు.
ఉక్రెయిన్ ను పరిపాలించేందుకు మాస్కోకు నియోలు, నాజీలు అవరం లేదన్నారు. ఉక్రెయిన్ లో రష్యా మిలటరీ ఆపరేషన్Russia Ukraine) పై అంతర్జాతీయ స్థాయిలో కీలక తీర్మానాన్ని చేసే సమయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత దేశం నుంచి మద్దతు ఆశిస్తున్నట్లు రష్యా స్పష్టం చేసింది.
Also Read : యుద్దం ఆపాలంటూ ఆందోళన