India UNSC : ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్ష దాడులను ఖండిస్తూ ఐక్య రాజ్య సమితి(India UNSC )ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. భద్రతా మండలి అత్యవసరంగా నిర్వహించింది. రష్యా చర్యలను తీవ్రంగా గర్హించింది.
ఈ మేరకు భద్రతా మండలిలో ఓటింగ్ చేపట్టింది. ఐక్య రాజ్య సమితి, యూరోపియన్ దేశాలతో పాటు బ్రిటన్ , ఫ్రాన్స్ తో పాటు అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది.
దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ప్రతిపాదనపై భద్రతా మండలి లోని మొత్తం 15 సభ్య దేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. గత కొంత కాలం నుంచి భారత్ తటస్థంగా ఉంది.
దీంతో పాటు చైనా, యునైటెడ్ ఆఫ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఈ అత్యవసర ఓటింగ్ కు గైర్హాజరయ్యాయి. ఉక్రెయిన్ – రష్యా వివాదంలో గైర్హాజర్ కావడం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా భద్రతా మండలిలో మొత్తం అయిదు శాశ్వత దేశాలు ఉన్నాయి. ఇందులో రష్యా కూడా ఒకటి ఉంది. తన వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానం వీగి పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా ఓటింగ్ కు భారత దేశం దూరంగా ఉండడంపై భారత రాయబారి టీ.ఎస్. తిరుమూర్తి మాట్లాడారు. రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో విభేదాలు, వివాదాలను పరిష్కరించేందుకు అన్ని సభ్య దేశాలు చర్చలు జరపాలని సూచించారు.
ఉక్రెయిన్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో భారత్ తీవ్ర ఆందోళనకు గురవతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హింసను తక్షణమే నిలిపి వేయాలని, తాము మొదటి నుంచి శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
Also Read : సిద్దూకు సుప్రీం కోర్టు బిగ్ షాక్