Russia Ukraine War :  మ‌రోసారి ర‌ష్యా కాల్పుల విర‌మ‌ణ 

ఫ్రాన్స్ చీఫ్ అభ్య‌ర్థ‌న మేర‌కు స్పంద‌న 

Russia Ukraine War : ఓ వైపు ఉక్రెయిన్ పై యుద్దం చేస్తూ వ‌స్తున్న ర‌ష్యా ఉన్న‌ట్టుండి ఇవాళ తాత్కాలికంగా కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించింది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. అయితే ఎన్ని గంట‌లు ఉంటుంద‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఇప్ప‌టికే ఉక్రెయిన్ స‌ర్వం కోల్పోయే స్థితిలో నెల‌కొంది. ఎక్క‌డ చూసినా శిథిల‌మైన భ‌వ‌నాలు, రోద‌న‌లు, ఆక్రంద‌న‌లు, కాల్పులు, బాంబుల మోత‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది.

ఇదిలా ఉండ‌గా యుద్దం వ‌ద్ద‌ని శాంతి మాత్ర‌మే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని సాక్షాత్తు ప్ర‌పంచ వాటిక‌న్ క్యాథ‌లిక్ చ‌ర్చి పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు.

ఈ మేర‌కు తాను కూడా అవ‌స‌ర‌మైతే మాస్కోకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. యావ‌త్ ప్ర‌పంచం అంతా దాడులు ఆపాల‌ని కోరినా ప‌ట్టించు కోలేదు ర‌ష్యా చీఫ్ పుతిన్.

తాజాగా ఫ్రాన్స్ తో పాటు భార‌త్ అటు ర‌ష్యా చీఫ్ తో పాటు ఇటు ఉక్రెయిన్(Russia Ukraine War) అధ్య‌క్షుడితో మాట్లాడారు. ఫ్రాన్స్ అధ్య‌క్షుడి విన్న‌పం మేర‌కు పుతిన్ తాత్కాలికంగా కాల్పుల విర‌మ‌ణ ప్ర‌క‌టించినట్లు స‌మాచారం.

ఇంకో వైపు యుద్ద వాతావ‌ర‌ణం అలా ఉండ‌గానే శాంతి చర్చ‌ల‌కు సిద్దంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది ర‌ష్యా. తాము సైతం త‌గ్గేదే లేదంటూ ప్ర‌క‌టిస్తూ వ‌స్తున‌న ఉక్రెయిన్ సైతం చ‌ర్చ‌ల‌కు రెడీ అని  తెల‌ప‌డం విశేషం.

ఇదే క్ర‌మంలో పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు చైనా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. అదేమిటంటే ర‌ష్యా త‌మ‌కు మిత్ర దేశ‌మ‌ని ప్ర‌క‌టించారు ఆ దేశ చీఫ్ జిన్ పింగ్.

అవ‌స‌ర‌మైతే ఇరు దేశాల మ‌ధ్య సంధి కుదిర్చేందుకు రెడీగా ఉన్నామ‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీతో దాదాపు అర గంట పాటు ప్ర‌ధాని మోదీ సంభాషించిన‌ట్లు స‌మాచారం.

Also Read : యుద్దం ఆపేందుకు ప్ర‌య‌త్నం చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!