Ruthuraj Gaikwad : చుక్క‌లు చూపించిన రుతురాజ్

చెన్నై గెలుపులో కీల‌క పాత్ర

Ruthuraj Gaikwad : చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ క్వాలిఫ‌య‌ర్ -1 లో ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చింది చెన్నై సూప‌ర్ కింగ్స్ . డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ పై 15 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. వ‌రుస‌గా 10వ సారి ధోనీ సేన ఫైన‌ల్ కు చేరింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ర‌న్స్ చేసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad). క‌ళ్లు చెదిరే షాట్స్ ఆడాడు. కేవ‌లం 44 బంతులు ఆడి 7 ఫోర్లు 1 సిక్స‌ర్ తో 60 రన్స్ చేశాడు. చెన్నై స్కోర్ పెరిగేందుకు దోహ‌ద ప‌డ్డాడు. విచిత్రం ఏమిటంటే మిగ‌తా మ్యాచ్ ల‌లో తీవ్ర నిరాశ ప‌రిచాడు రుతురాజ్.

కానీ కీల‌క‌మైన మ్యాచ్ లో స‌త్తా చాటాడు. కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాడు. ఇక రుతురాజ్ తో పాటు డేవాన్ కాన్వే 34 బంతుల్లో 4 ఫోర్ల‌తో 40 ర‌న్స్ చేశాడు. ర‌హానే 10 బంతుల్లో 17 ప‌రుగుల‌తో రాణించాడు. రాయుడు 9 బంతుల్లో 17 ర‌న్స్ చేశాడు.

అనంత‌రం 173 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో గుజ‌రాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. 20 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది. చెన్నై బౌల‌ర్ల ధాటికి వికెట్లు ట‌పా ట‌పా రాలాయి. డాసున్ శ‌న‌క 17 ర‌న్స్ చేస్తే సాహా 12 , విజ‌య్ శంక‌ర్ 14, హార్దిక్ పాండ్యా 8 , డేవిడ్ మిల్ల‌ర్ 4, రాహుల్ తెవాటియా 3 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు.

Also Read : CSK vs GT Qualifier1

 

Leave A Reply

Your Email Id will not be published!