Rythu Runa Mafi : ఈరోజు రెండో విడత రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్

ఇక వికారాబాద్ జిల్లాలో 23వేల 912మంది రైతులకు 240 కోట్లు రిలీజ్ చేసింది...

Rythu Runa Mafi : తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్‌ ఇవాళ మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. రుణమాఫీ రెండోవిడత జూలై 30న విడుదల చేసింది. రెండు విడత రుణ మాఫీలో భాగంగా లక్షన్నరలోపు ఉన్న వారికి రుణమాఫీ చేసింది. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఈ రుణమాఫీని విడుదల చేశారు. జిల్లాల వారీగా రుణమాఫీ పొందిన వారి వివరాలు చూస్తే.. నల్లగొండ జిల్లాలో 51వేల 515 రైతుల ఖాతాల్లో 514 కోట్లు జమ చేసింది సర్కార్. నాగర్ కర్నూల్ జిల్లాలో 32వేల 406 రైతుల ఖాతాల్లో 312 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 27వేల 249 రైతులకు 286 కోట్లు విడుదల చేసింది. సిద్దిపేట జిల్లాలో 27వేల 875 రైతులకు 277 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 26వేల 437రైతులకు 250 కోట్లు కేటాయించింది. ఖమ్మం జిల్లాలో 33వేల 942రైతులకు 262 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో 24వేల ఏడుమంది రైతులకు 229 కోట్లు, మెదక్ జిల్లాలో 22వేల 850మంది రైతులకు 216 విడుదల చేసింది తెలంగాణ సర్కార్.

2nd Rythu Runa Mafi..

ఇక వికారాబాద్ జిల్లాలో 23వేల 912మంది రైతులకు 240 కోట్లు రిలీజ్ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 22వేల 253మంది రైతులకు 219 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో 23వేల 769మంది రైతులకు 219 కోట్లు, కరీంనగర్ జిల్లాలో 21వేల 785మంది రైతులకు 207 కోట్లు విడుదల చేసింది సర్కార్. కామారెడ్డి జిల్లాలో 24వేల 816మంది రైతులకు 211 కోట్లు, నిర్మల్ జిల్లాలో 18వేల 728మంది రైతులకు 196 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 18వేల 127మంది రైతులకు 177 కోట్లు విడుదల చేశారు.

Also Read : MP Jaya Bachchan : రాజ్యసభ లో అసహనం వ్యక్తం చేసిన జయా బచ్చన్

Leave A Reply

Your Email Id will not be published!