S Jai Shankar : చమురు దిగుమతులు సబబే – జై శంకర్
రష్యన్ ఆయిల్ కొనుగోలుపై కామెంట్
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యన్ జయ శంకర్ ( ఎస్ జై శంకర్ ) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన రష్యాతో ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని పూర్తిగా సమర్థించారు.
ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ఒక దేశం ఎవరితో స్నేహం చేయాలో ఇంకెవరితో చేయ కూడదనే అంశం ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ విధానం మీద ఆధారపడి ఉంటుందన్నారు.
ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించే రోజులు పోయాయని కుండ బద్దలు కొట్టారు. రష్యా నుండి భారత దేశం చమురు దిగుమతులు చేసుకోవడంలో తప్పు పట్టాల్సింది ఏముందని ప్రశ్నించారు జై శంకర్(S Jai Shankar).
ఉక్రెయిన్ వివాదం అభివృద్ది చెందుతున్న దేశాలపై ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలని సూచించారు. అర్ధరహితమైన విమర్శలు మాను కోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు.
బ్రాటిస్లావా ఫోరమ్ లో ఎస్. జైశంకర్ పాల్గొని ప్రసంగించారు. దేశం అనుసరిస్తున్న విధానం గురించి స్పష్టం చేశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నాక్ ఆఫ్ ఎఫెక్ట్ ను సృష్టించిన ఉక్రెయిన్ యుద్దం మధ్య రష్యా నుండి భారత్ చమురు కొనుగోలుపై అన్యాయమైన విమర్శలను ఈ సందర్భంగా సమర్థవంతంగా జై శంకర్(S Jai Shankar) తిప్పి కొట్టారు.
ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు యూరప్ పై. ఉక్రెయిన్ , రష్యా మధ్య జరుగుతున్న యుద్దంలో రష్యా నుంచి యూరప్ గ్యాస్ దిగుమతి చేసుకుంటోందని కానీ భారత్ ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు జై శంకర్.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిత్రులు అనే అంశంపై విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడారు.
Also Read : భారత్ లో మైనార్టీ వర్గాలపై దాడులు