S Jai Shankar : ఇజ్రాయెల్ తో బంధం బలీయం
విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి 2017లో చేసిన ఇజ్రాయెల్ పర్యటన తనకు గూస్ బంప్ గా మిగిల్చిందన్నారు.
గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలీయంగా మారిందన్నారు. టెల్ అవీవ్ లో జరిగిన సన్నివేశం ఇప్పటికీ తాను మరిచి పోలేక పోతున్నానని చెప్పారు జై శంకర్(S Jai Shankar).
ఇజ్రాయెల్ స్వాత్రంత్ర దినోత్సవం సందర్బంగా జరిగిన సభలో విదేశాంగ శాఖ మంత్రి ప్రసంగించారు. భారత దేశం , ఇజ్రాయెల్ మధ్య సంబంధాన్ని నిజంగా ప్రత్యేకమైనదని ఆయన చెప్పారు.
ఆనాటి పర్యటన ను ఇప్పటికీ మరిచి పోలేక పోతున్నట్లు తెలిపారు జై శంకర్(S Jai Shankar). ఇజ్రాయెల్ కు 74 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
విచిత్రం ఏమిటంటే ఆ దేశాన్ని సందర్శించిన మొట్ట మొదటి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని వెల్లడించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మైత్రీ బంధం మరింత పెరుగుతూ వస్తోందని స్పష్టం చేశారు
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ఆవిష్కరణలు, పరిశోధనలలో సహకారంతో కూడిన విజ్ఞాన ఆధారిత సంబంధాన్ని విస్తరించడంపై ఇరు దేశాలు ఫోకస్ పెట్టాయని అన్నారు జై శంకర్(S Jai Shankar).
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల్లో ఇజ్రాయెల్ అంతర్భాగంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో ఇక్కడి నుంచి విద్యార్థులు అక్కడికి వెళుతున్నారని వెల్లడించారు.
భారత దేశం, ఇజ్రాయెల్ , యుఏఈ , యుఎస్ లతో కూడిన కొత్త క్వాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు జై శంకర్.
Also Read : TS Tirumurti : భారత్ కు స్వంత విధానం ఉంది