S Jai Shankar George Soros : జార్జ్ సోరోస్ పై జై శంకర్ కామెంట్స్
మోదీపై వ్యాఖ్యలు అర్థరహితం
S Jai Shankar George Soros : ప్రపంచ బిలియనీర్ జార్జ్ సోరోస్ పై నిప్పులు చెరిగారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల అనుచితంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉన్న ఏకైక దేశం ఒక్క భారత దేశం మాత్రమేనని పేర్కొన్నారు జై శంకర్(S Jai Shankar George Soros) . శనివారం ఆయన సిడ్నీలో మాట్లాడారు. ఏ దేశమైనా మరో దేశంతో సత్ సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు .
ఈ సమయంలో ఇలాంటి చవకబారు, అనాలోచిత వ్యాఖ్యల వల్ల మరింత దూరం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు జై శంకర్. ఇప్పటికే తమ సహచర మంత్రి స్మృతీ ఇరానీ సైతం తీవ్రంగా ఖండించిందన్నారు. ఈ సందర్భంగా జార్జ్ సోరోస్ ను వృద్దుడు అని పిలిచారు.
ఈ వయస్సులో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని సూచించారు ఎస్ జై శంకర్ . స్వంత అభిప్రాయాలను ప్రపంచానికి రుద్దాలని అనుకోవడం ఒట్టి భ్రమ అని పేర్కొన్నారు.
ఆయన న్యూయార్క్ లో కూర్చొని పాత, గొప్ప అభిప్రాయాలను కలిగి ఉండడం విస్తు పోయేలా చేసిందన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ప్రజలు వాస్తవానికి కథనాలను రూపొందించడంలో వనరులను పెట్టుబడిగా పెడతారని చెప్పారు. సోరోస్ లాంటి వ్యక్తులు తాము చూడాలని అనుకునే వ్యక్తి గెలిస్తే ఎన్నికలు మంచివని భావిస్తారని , ఒకవేళ ఆ ఎన్నికలు భిన్నమైన ఫలితాలు కలిగిస్తే అది లోప భూయిష్టమైన ప్రజాస్వామ్యమని చెబుతారని ఎద్దేవా చేశారు.
Also Read : జార్జ్ సోరోస్ తో ఏకీభవించను – చిదంబరం