S Jai Shankar RRR Movie : జై శంక‌ర్ నోట ‘ఆర్ఆర్ఆర్’ మాట

హాజ‌రైన మాజీ పీఎం, మాజీ క్రికెట‌ర్

S Jai Shankar RRR Movie : భార‌త దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ గా గుర్తింపు పొందారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, అమిత్ షా త‌ర్వాత భార‌త దేశం నుంచి విదేశాల‌తో సంబంధాల‌ను నెర‌ప‌డంలో, దౌత్య ప‌ర‌మైన ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న త‌న‌కు తాను ప్రూవ్ చేసుకున్నారు.

పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ సైతం సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ అనుస‌రిస్తున్న విదేశాంగ విధానం గురించి కితాబు ఇచ్చారు. తాజాగా జై శంక‌ర్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ప్ర‌స్తుతం భార‌త దేశం జి20 గ్రూప్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తోంది.

ఈ సంద‌ర్బంగా వివిధ దేశాల‌కు చెందిన విదేశాంగ మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. భార‌త దేశం , యునైటెడ్ కింగ్ డ‌మ్ దేశాల భాగ‌స్వామ్య చ‌రిత్ర ప‌రంగా అభివృద్ది చెందుతున్న సంబంధాల గురించి మాట్లాడారు. ఇదే స‌మ‌యంలో జై శంక‌ర్(S Jai Shankar RRR Movie) ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. యూకే మాజీ ప్ర‌ధాని టోనీ బ్లెయిర్ , మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీటర్స‌న్ హాజ‌రు కావ‌డం విశేషం.

వ‌ల‌స రాజ్యాల పాల‌న‌ను ప్ర‌స్తావించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే మీరు సినిమాలో మంచి వ్య‌క్తులుగా లేరంటూ పేర్కొన్నారు జై శంక‌ర్ . దీంతో అక్క‌డంతా న‌వ్వులు విరిశాయి. లీడ‌ర్ షిప్ ఇన్ ది ఏజ్ ఆఫ్ అన్ సెర్టినిటీ అనే అంశంపై జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో విదేశాంగ శాఖ మంత్రి ప్ర‌సంగించారు.

Also Read : భార‌త్ తో బ‌ల‌మైన భాగ‌స్వామ్యం – పీఎం

Leave A Reply

Your Email Id will not be published!