S Suresh Kumar : ఏపీలో 24 వరకు ఒంటి పూట బడులు
పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ప్రకటన
S Suresh Kumar : ఈ ఏడాది వరుణ దేవుడు కరుణించ లేదు. దీంతో ఎక్కడ చూసినా ఎండలు, వడగాల్పులతో జనం అల్లాడుతున్నారు. ఊపిరి పీల్చుకునేందుకు సైతం ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఇప్పటికే నిర్దేశించిన మేరకు ఏపీలో బడులను తెరిచారు. ఎండ వేడిమి కారణంగా చిన్నారులు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను బడులను పూర్తి స్థాయిలో కాకుండా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ విద్యా శాఖ.
కాగా తాజాగా పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్ సురేష్ కుమార్(S Suresh Kumar) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రమంతా ఎడతెగని రీతిలో ఎండ తాపం ఉండడం వల్ల ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
విద్యార్థులు, టీచర్లు ఇబ్బంది పడకూడదని మరో వారం రోజుల పాటు ఒంటి పూట బడులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు కమిషనర్. బడులు ఉదయం 7.30 గంటల నుండి 11.30 గంటల వరకు , రాగి జావ ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు , మధ్యాహ్న భోజనం 11.30 నుండి 12 గంటల వరకు నిర్వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేశారు.
Also Read : V Srinivas Goud : 30 కిలోల ‘సందె రాయి’ ఎత్తిన మంత్రి
