Saamana Modi : మోదీ మౌనం దేశానికి ప్రమాదం
అభివృద్ధిలో భారత్ వెనక్కి
Saamana Modi : శివసేన , భారతీయ జనతా పార్టీల మధ్య ఆధిపత్య పోరు , మాటల యుద్దం కొనసాగుతూనే ఉన్నది. కేంద్రం మరాఠా సంకీర్ణ సర్కార్ ను టార్గెట్ చేసింది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు జల్లెడ పడుతున్నాయి.
నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసింది. మరో మంత్రి అనిల్ పరవ్ ఇళ్లపై దాడులు చేపట్టింది. ఇక శివసేన పార్టీకి చెందిన మౌత్ పీస్ గా వస్తోంది సామ్నా(Saamana Modi) పత్రిక. ఈ పత్రికకు శివసేన జాతీయ అధికార పార్టీ ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ గౌరవ సంపాదకుడిగా ఉన్నారు.
తాజాగా విడుదలైన సంచికలో ప్రధాని మోదీ(Saamana Modi) ని టార్గెట్ చేసింది సంపాదకీయం. కేంద్రం అనుసరిస్తున్న విధి విధానాలను తీవ్రంగా తప్పు పట్టింది.
దేశంలో ఎన్నడూ లేని రీతిలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగినా పట్టించు కోవడం లేదంటూ మోదీపై నిప్పులు చెరిగింది. నిరుద్యోగం, కాశ్మీర్, జ్ఞాన్ వాపి, హిజాబ్ తదితర సమస్యల విషయంలో కేంద్రం సరిగా వ్యవహరించడం లేదంటూ మండిపడింది.
ఇక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనం చేయాల్సింది పోయి మౌనంగా ఉండడం ఎంత వరకు అని ప్రశ్నించింది. దేశంలో ఉన్నంత నిరుద్యోగిత ప్రపంచంలో ఎక్కడా లేదని పేర్కొంది.
ఈ విషయం ప్రపంచమంతా తెలుసని పేర్కొంది. మోదీ(Modi) ఇలాగే మొండిగా ప్రవర్తిస్తూ పోతే ఏదో ఒకరోజు భారత్ శ్రీలంక లాగా మారడం ఖాయమని హెచ్చరించింది శివసేన సామ్నా.
కశ్మీర్ లోయలో దేశం పక్షంగా ఉన్నవారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగ బడుతున్నారంటూ వాపోయింది.
Also Read : 424 మందికి సెక్యూరిటీ తొలగింపు