Sabitha Indrarreddy: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికు అస్వస్థత

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికు అస్వస్థత

Sabitha Indrarreddy : మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీనితో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. సిద్ధిపేట జిల్లాలో ఎర్రవల్లి ఫామ్‌ హౌజ్‌ లో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమయంలోనే సబిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం లంచ్ తర్వాత జరిగిన రెండో విడత సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే ఆమె వెళ్లిపోయారు.

Sabitha Indrarreddy Health Updates

ఫామ్ హౌజ్ నుండి తిరుగు ప్రయాణంలో అస్వస్థతకు గురైన సబితను వెంటనే బీఆర్‌ఎస్ శ్రేణులు దగ్గర్లోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. వెంటనే అడ్మిట్ చేసుకున్న వైద్యులు… ఆమె డైజెషన్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆపై సబితకు చికిత్స అందజేశారు. రాత్రి ప్రథమ చికిత్స అనంతరం కొద్దిసేపు అబ్జర్వేషన్‌ లో ఉంచారు వైద్యులు. తరువాత అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆరోగ్యం కాస్త మెరుగవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ కు తిరుగు పయనమయ్యారు. విషయం తెలుసుకున్న పార్టీ అధినేత కేసీఆర్… సబిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే బీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

Also Read : Indian Airforce: ఒకే రోజు కూలిన రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు

Leave A Reply

Your Email Id will not be published!