Sachin Pilot Protest : సీఎం గెహ్లాట్ పై పైలట్ దీక్ష
అవినీతిని అంతం చేయాలని
Sachin Pilot Protest : రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన సీఎం అశోక్ గెహ్లాట్ సారథ్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది. గత కొంత కాలం నుంచి మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు సీఎం గెహ్లాట్ కు మధ్య పడడం లేదు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తన సర్కార్ ను బీజేపీతో చేతులు కలిపి పడగొట్టేందుకు పైలట్ కుట్రలు పన్నాడంటూ సంచలన విమర్శలు చేశాడు గెహ్లాట్.
ఇదే సమయంలో రాహుల్ గాంధీ కూడా జోక్యం చేసుకోవడంతో కొంత మేర వెనక్కి తగ్గారు సచిన్ పైలట్ . కానీ ఉన్నట్టుండి రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై ప్రస్తుత సీఎం గెహ్లాట్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.
ఆపై సీఎంపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించాడు. మంగళవారం ఏకంగా అవినీతిపై ఏకంగా నిరాహారదీక్ష చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల రోజుల దూరంలో ఉండడంతో పైలట్(Sachin Pilot Protest) ఇలా నిరసనకు దిగడం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా సచిన్ పైలట్ కు కాంగ్రెస్ పార్టీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అలాగే ముందుకు సాగితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆయన చేపడుతున్న నిరాహారదీక్ష పార్టీ ప్రయోజనాలకు విరుద్దమని , పార్టీ వ్యతిరేక చర్య అని, ప్రభుత్వంతో ఏదైనా సమస్య ఉంటే మీడియా, ప్రజల్లో కాకుండా పార్టీ వేదికలపై చర్చించాలని స్పష్టం చేసింది.
Also Read : మారిన స్వరం సోనియా ఆహ్వానం