Sachin Pilot : మోదీజీ ఇకనైనా కళ్లు తెరవండి – పైలట్
అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకోండి
Sachin Pilot : ఇకనైనా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కళ్లు తెరవాలని సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు సచిన్ పైలట్(Sachin Pilot). కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీం వల్ల యువకులకు ఎలాంటి లాభం లేదన్నారు.
దీని వల్ల దేశానికి నష్టం తప్ప ప్రయోజనం లేదన్నారు. ఎవరితో చర్చించకుండానే , ప్రతిపక్షాలతో సంప్రదించకుండానే కేంద్ర సర్కార్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారంటూ ఆరోపించారు సచిన్ పైలట్(Sachin Pilot).
ఇకనైనా ప్రధాన మంత్రి పునరాలోచించాలని సూచించారు. ఇప్పటి వరకు సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు రూ. 20,000 కోట్లు, ప్రధాని నరేంద్ర మోదీ కోసం రూ. 8,400 కోట్ల కస్టమ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ పై ప్రశ్నించారు .
మీరు మొండిగా వ్యవహరించడం వల్ల యువకులు ఆందోళన బాట పట్టారు. పలు చోట్ల రైళ్లను ధ్వంసం చేశారు. బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు.
దేశంలోని 1.38 మిలియన్ల మంది సైనిక దళాలకు పెన్షన్ ఖర్చును , సిబ్బంది సగటు వయస్సును తగ్గించేందుకు కొత్త పథకాన్ని మంగళవారం ప్రకటించారు.
ఈ చర్యను విమర్శిస్తూ సెంట్రల్ విస్టా అవెన్యూ, తదితర ప్రాజెక్టులను ప్రభుత్వం పునరాలోచించాలని సచిన్ పైలట్ ప్రశ్నించారు.
కేంద్రం పెన్షన్ బిల్లులు తగ్గించాలని అనుకుంటే ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు ఆలోచించడం లేదంటూ నిలదీశారు.
ఇప్పటికే మోదీ ముందు చూపు లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు దేశంలో ఆందోళనలకు దారి తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగు చట్టాలు వెనక్కి తీసుకున్నారు.
ఇకనైనా అహంకారం వీడి అగ్నిపథ్ స్కీం వెనక్కి తీసుకోవాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు.
Also Read : అగ్నిపథ్ స్కీం అద్బుత పథకం – మంత్రి