Sadhguru CM : స‌ద్గురు..సీఎం శ‌ర్మ అర్ధ‌రాత్రి షికారు

ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ల ఫిర్యాదు..ఫైర్

Sadhguru CM : ఆధ్యాత్మిక గురు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ‌న్(Sadhguru CM) కు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న వ‌న్య ప్రాణుల చ‌ట్టాన్ని ఉల్లంఘించారంటూ వ‌న్య ప్రాణుల‌, ప‌ర్యావ‌ర‌ణ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వ‌న్య ప్రాణుల ర‌క్ష‌ణ చ‌ట్టం 1972 ప్ర‌కారం జంతువుల‌ను సంర‌క్షించేందుకు, వాటి ఆవాసాల‌ను తాక‌కుండా ఉండేందుకు జాతీయ ఉద్యాన‌వ‌నంలో స‌ఫారీ టూర్లపై నిషేధం ఉంద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా నిత్యం నీతి సూత్రాలు, బోధ‌న‌లు, చ‌ట్టాల గురించి ఉప‌న్యాసాలు ఇచ్చే స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ‌న్ త‌న దాకా వ‌స్తే వాటిని పాటించ‌రంటూ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం స‌ద్గురు అస్సాంలోని కజిరంగా నేష‌న‌ల్ పార్క్ లో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా తాను , జ‌గ్గీ వాసుదేవ‌న్(Sadhguru CM) , ప‌ర్యాట‌క శాఖ మంత్రి జ‌యంత మ‌ల్లా బారుహ్ రాత్రి స‌ఫారీ కోసం కాజిరంగా నేష‌న‌ల్ పార్క్ లోకి ప్ర‌వేశించామ‌ని, వ‌న్య ప్రాణుల ర‌క్ష‌ణ చ‌ట్టాన్ని ఉల్లంఘించిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌(Hemant Biswa Sharma).

అస్సాం లోని ఇద్ద‌రు ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌లు సోనేశ్వర్ నారా, ప్రబిన్ పెగు స‌ద్గురు జ‌గ్గీ వాసు దేవ‌న్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సంద‌ర్శ‌న స‌మ‌యానికి మించి జాతీయ ఉద్యాన‌వ‌నంలోకి ప్ర‌వేశించారంటూ ఆరోపించారు. ఆయ‌న‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఇదిలా ఉండ‌గా సోష‌ల్ మీడియాలో స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ‌న్ , బారూహ్ ల‌తో క‌లిసి ఓపెన్ స‌ఫారీ ఎస్యూవీని న‌డుపుతున్న‌ట్లు చూపిస్తున్నాయి. కాగా రాత్రి త‌ర్వాత కూడా ప‌ర్య‌టించేందుకు ఉద్యాన‌వ‌నానికి చెందిన వార్డెన్ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌.

Also Read : షహీద్’ కు అరుదైన గౌర‌వం

Leave A Reply

Your Email Id will not be published!