Sadhguru Save Soil : సద్దురు జగ్గీ వాసుదేవన్ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన వయసు 65 ఏళ్లు. ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు. కానీ 30 వేల కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించారు.
అదే సేవ్ సాయిల్(Sadhguru Save Soil )పేరుతో జర్నీ స్టార్ట్ చేశారు. 100 రోజుల కార్యక్రమం ఇది. సద్దురు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన భారతీయ ఆధ్యాత్మిక వేత్త. యోగా గురువుగా పాపులర్. జగ్గీ లండన్ నుంచి భారత దేశానికి వెళ్లే మార్గంలో పలు దేశాలను సందర్శిస్తారు.
ప్రకృతి ఇస్తున్న వనరులలో భూమి అత్యంత విలువైనది. ఇది అగ్ని గుండంగా మారింది. దానిని కాపాడు కోవాలంటూ పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు, పర్యావరణవేత్తలు, ప్రభావ సీలురు ఆయనను కలుసుకుంటారు.
తమ మద్దతు ప్రకటిస్తారు. ఈ సేవ్ సాయిల్ (Sadhguru Save Soil )ద్వారా ధరణికి ఉన్న విలువేంటో చెబుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మూడొంతుల నేల క్షీణించిందని 2050 నాటికి 90 శాతం కంటే డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు సద్గురు.
నేను శాస్త్రవేత్తను కాదు. పర్యావరణవేత్తను కాను. నేను ఈ మట్టికి చెందిన మనిషిని. కానీ ఈ భూమి ఇప్పుడు ఇబ్బందులు పడుతోందని ఆవేదన చెందుతున్నారు సద్గురు.
జగ్గీ చేపట్టిన ఈ జర్నీకి జేన్ గూడాల్ , దీపక్ చోప్రా , కొలంబియన్ గాయకుడు రచయిత మలుమా , ఇంగ్లండ్ రగ్బీ ప్లేయర్ జానీ విల్కిన్సన్ , జర్మన్ పుట్ బాల్ ఆటగాడు తదితరులు మద్దతు ప్రకటించారు.
ప్రజలతో అనుసంధానం కావడానికి తాను మోటారు సైకిల్ ను ఎంచుకున్నానని , ప్రయాణం, మ్యూజిక్ తో కలిసి సాగుతున్నట్లు తెలిపారు.
Also Read : హనుమంతుడి త్యాగం స్మరణీయం