Sai Sudarshan : సాయి సుద‌ర్శ‌న్ సెన్సేష‌న్

చెన్నైకి చుక్క‌లు చూపించిన క్రికెట‌ర్

Sai Sudarshan : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 16వ సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ధోనీ సేన విజేత‌గా నిలిచింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. వ‌ర్షం అడ్డంకిగా మార‌డంతో అంపైర్లు డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని అనుస‌రించారు. దీంతో చెన్నై ముందు 15 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ చేయాల్సి వ‌చ్చింది.

అంత‌కు ముందు గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. యంగ్ క్రికెట‌ర్ సాయి సుద‌ర్శ‌న్(Sai Sudarshan) మ‌రోసారి దంచి కొట్టాడు. త‌న‌దైన శైలిలో రాణించాడు. కేవ‌లం 47 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సుద‌ర్శ‌న్ 8 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 96 ర‌న్స్ చేశాడు. తృటిలో సెంచ‌రీని కోల్పోయాడు.

చెన్నై సూప‌ర్ కింగ్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో అల‌రించాడు. మైదానం అంత‌టా షాట్స్ ఆడేందుకు య‌త్నించాడు. కేవ‌లం 4 ప‌రుగుల దూరంలో సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని మిస్ అయ్యాడు సాయి సుద‌ర్శ‌న్. మొత్తంగా ఆఖ‌రి బంతి వ‌ర‌కు సాగిన ఈ కీల‌క ఫైన‌ల్ మ్యాచ్ చివ‌రి దాకా టెన్ష‌న్ క‌లిగించింది. గెలుపు ఇరు జ‌ట్ల‌ను ఊరించింది. కానీ గుజ‌రాత్ ఆశ‌లపై నీళ్లు చ‌ల్లాడు ర‌వీంద్ర జ‌డేజా. ఆఖ‌రి రెండు బంతుల్లో 10 ర‌న్స్ కావాల్సి వ‌చ్చింది. 6, 4 కొట్టి ప‌ని పూర్తి చేశాడు. మొత్తంగా సాయి సుంద‌ర్శ‌న్ ఇన్నింగ్స్ మాత్రం మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది.

Also Read : CSK IPL 2023 Champions

Leave A Reply

Your Email Id will not be published!