Sajjala Ramakrishna Reddy : బాబు అరెస్ట్ కాక త‌ప్ప‌దు

స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి

Sajjala Ramakrishna Reddy : తాడేప‌ల్లి గూడెం – ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. ఐటీ శాఖ నోటీసుల‌కు జ‌వాబు ఇవ్వ‌కుండా ఎంత కాలం మౌనంగా ఉంటారంటూ ప్ర‌శ్నించారు.

Sajjala Ramakrishna Reddy Comments Viral

ఆరు నూరైనా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. సాంకేతిక అంశాలు చూపి ఇన్నాళ్లు త‌ప్పించుకుంటూ వ‌చ్చార‌ని ఆరోపించారు. పాపం పండిన‌ప్పుడు అరెస్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ కూడా ఇదే స‌మ‌యంలో విచార‌ణ జ‌రిపి త్వ‌ర‌గా అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). బాబుకు ముడుపులు ఏ ర‌కంగా ముట్టాయో ఐటీ శాఖ వివ‌రాల‌తో స‌హా బ‌య‌ట పెట్టింద‌న్నారు.

ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ నుంచి త‌ప్పించు కోలేర‌న్నారు. రూ.118 కోట్లు అడ్డంగా తీసుకుని బుక్క‌య్యాడ‌ని మండిప‌డ్డారు. త‌న‌ను అరెస్ట్ చేస్తారంటూ పైకి చెప్ప‌డం త‌ప్పించు కునేందుకేన‌ని ఎద్దేవా చేశారు .

ఇప్ప‌టికైనా త‌ప్పు ఒప్పుకుని అరెస్ట్ అయితే బెట‌ర్ అంటూ హిత‌వు ప‌లికారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. ఇలా ఎంత కాలం ఇత‌రుల‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తారంటూ ప్ర‌శ్నించారు.

Also Read : RK Roja Selvamani : ఇండియా కంటే భార‌త్ బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!