Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట

Sajjala Ramakrishna Reddy : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఏపీ హై కోర్టులో ఊరట లభించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో… తమను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని వదంతులు రావడంతో… ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy), ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనితో వారికి హైకోర్టు గురువారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Sajjala Ramakrishna Reddy got Relief from High Court

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశ్యించి దుర్భాషలను ఆడిన కేసులో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 చోట్ల పోసానిపై కేసులు నమోదుకాగా… వివిధ స్టేషన్లు, జైళ్ళు చుట్టూ తిరిగి చివరకు బెయిల్ పై విడుదలయ్యారు. అయితే పోలీసుల విచారణ సమయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడానని చెప్పిన అంశంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో సజ్జల పిటీషన్ దాఖలు చేశారు.

దీనితో సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డి… ముందస్తు బెయిల్ కోసం హై కోర్టును ఆశ్రయించారు. పోసాని నేర అంగీకార పత్రం ద్వారా ఓబులవారి పల్లె పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటీషన్‌ లో సజ్జల ప్రస్తావించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఇద్దరికీ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ… ఒక్కొక్కరూ రూ.10 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు సజ్జల సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Also Read : CM Chandrababu Naidu: 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తాం – సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!