Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు నోరు విప్పాలి
సజ్జల రామకృష్ణా రెడ్డి డిమాండ్
Sajjala Ramakrishna Reddy : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరిగారు. శనివారం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఐటీ (ఆదాయ పన్ను) శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ప్రజలు తెలుసు కోవాలని అనుకుంటున్నారని అన్నారు.
Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu
తప్పు చేయక పోతే నోటీసు గురించి ప్రశ్నించాలి కదా..ఆ పని చేయడం లేదంటే అవినీతి రుజువైనట్టేనని తేలి పోయిందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). జాతీయ మీడియాలో కథనాలు వచ్చినా ఇంకా ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు. ఐటీ నోటీసులకు సూటిగా సమాధానం చెప్పకుండా గత రెండు సంవత్సరాలుగా సాగదీత ధోరణి అవలంభిస్తున్నారంటూ ఆరోపించారు.
అమరావతిని అవినీతికి కామ ధేనువుగా మార్చుకున్నారంటూ మండిపడ్డారు. రాజధాని పేరుతో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రాజధాని కట్టే ఆలోచన లేదన్నారు. అత్యధిక రేట్లకు ఆ రెండు కంపెనీలకు కట్టబెట్టారంటూ ధ్వజమెత్తారు సజ్జల రామకృష్నా రెడ్డి.
తాత్కాలిక నిర్మాణాలకే వందల కోట్లు ఖర్చు చేశాడని , సబ్ కాంట్రాక్ట్ పేరుతో షెల్ కంపెనీల ద్వారా ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని గతంలో ప్రశ్నించామని , తాజాగా ఐటీ నోటీసులతో అది రుజువైందన్నారు.
Also Read : YS Sharmila : కాంగ్రెస్ పార్టీని క్షమించాలి – షర్మిల