Sajjala Ramakrishna Reddy : క‌ర‌క‌ట్ట నివాసం అక్ర‌మ క‌ట్ట‌డం

ప్ర‌భుత్వ స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడిపై నిప్పులు చెరిగారు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు నాయుడు నివాసం ఉంటున్న క‌ర‌క‌ట్ట ఇల్లు క‌చ్చితంగా అక్ర‌మ క‌ట్ట‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. పైకి నీతులు చెబుతూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్న చంద్ర‌బాబుకు మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

లింగ‌మనేని ర‌మేష్ చేసిన కామెంట్స్ పై మండిప‌డ్డారు. భ‌వ‌నాలు ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తే అందుకు సంబంధించి ఆధారాలు చూపించాల‌ని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రో కోలో భాగంగానే రాజ‌ధాని నుంచి లింగ‌మ‌నేని భూముల్ని మిన‌హాయించినందుకు నాలుగు ఎక‌రాల క‌ర‌క‌ట్ట భూమిని ఆనాడు చంద్రాబు నాయుడికి అప్ప‌గించార‌ని మండిప‌డ్డారు స‌జ్జ‌ల రామ‌కృష్నా రెడ్డి.

చంద్ర‌బాబు హ‌యాంలో అతి పెద్ద స్కాం అమ‌రావ‌తి నిర్మాణ‌మ‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం ఆయ‌న నివాసాన్ని ప్ర‌భుత్వం అటాచ్ చేసింద‌ని చెప్పారు. ప్రైవేట్ భూమికి బాబు అద్దె గ‌నుక చెల్లిస్తే చూపించాల‌ని కోరారు. లింగ‌మ‌నేని ర‌మేష్ కి హెరిటేజ్ కి మ‌ధ్య ఆర్థిక లావాదేవీలు జ‌రిగాయ‌ని ఫైర్ అయ్యారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెనుక‌బడిన వర్గాల అభివృద్ది దిశ‌గా ప‌ని చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం , ప‌వ‌న్ క‌ళ్యాణ్ , వామ‌ప‌క్ష పార్టీలు సంప‌న్నుల కోసం ప‌ని చేస్తున్నారంటూ ఆరోపించారు . చంద్ర‌బాబుకు పొద్దస్త‌మానం జ‌గ‌న్ ను తిట్ట‌డం త‌ప్ప మ‌రో ప‌ని లేద‌ని ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!