Sala Ramakrishna Reddy : ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy ). ఇవాళ వైసీపీ ఏర్పాటై 11 సంవత్సరాలు పూర్తయి 12వ వసంతంలోకి వచ్చింది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదన్నారు. ప్రజలు తమకు ఐదేళ్ల పాటు పాలించమని అవకాశాం ఇచ్చారని ఆ దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజున మూడేళ్ల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ముందస్తు ఊహాగానాలపై స్పందించడమే కాదు కొట్టి పారేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రస్తుతం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy ).
విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ పై సీఎం జగన్ రెడ్డి ఫోకస్ పెట్టారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.
ఇవాళ ఏపీ దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. నాడు నేడు కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమమని రాష్ట్రాలు కొనియాడుతున్నాయని పేర్కొన్నారు.
పచ్చ మీడియా ద్వారా టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మ వద్దన్నారు సజ్జల. పార్టీ పరంగా సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు.
Also Read : అవంతికి అసమ్మతి సెగలు