Salman Butt : రమీజ్ రాజాపై సల్మాన్ భట్ ఫైర్
పీసీపీ పనితీరు అస్తవ్యవస్తం
Salman Butt : పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాపై నిప్పులు చెరిగారు ఆ దేశ జట్టు మాజీ కెప్టెన్ సల్మాన్ భట్. మొదటి నుంచి రమీజ్ రాజాను టార్గెట్ చేస్తూ వచ్చాడు. దేశంలో పిచ్ ల పరిస్థితి దారుణంగా ఉందన్నాడు.
వెస్టిండీస్ తో ముల్తాన్ లో మూడు వన్డేలు ఆడనుంది. ఈ ఏడాది ఆరంభం ఫిబ్రవరి – మార్చి లో ఆస్ట్రేలియా పర్యటన తర్వాత పాకిస్తాన్ కి ఇది మొదటి అంతర్జాతీయ సీరీస్. మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడింది.
ఆసిస్ టెస్ట్ సీరీస్ ను 1-0తో గెలుచుకుంది. సీరీస్ అంతటా పీసీబీ చేపట్టిన పిచ్ ల పరిస్థితి గురించి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ పిచ్ లు బౌలర్లకు ఇబ్బందిగా మారాయని ఆరోపించారు.
ఒకానొక దశలో పాకిస్తాన్ బోర్డు భారత దేశంలో ఉన్న క్యూరేటర్లను చూసి నేర్చు కోవాలని హితవు పలికారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
పిచ్ లు బాగో లేక పోతే ఎంత మంచి బ్యాటర్ అయినా లేదా బౌలర్ అయినా పరుగులు, వికెట్లు తీయలేరని స్పష్టం చేశాడు సల్మాన్ భట్(Salman Butt). బాబర్ ఆజమ్ కెప్టెన్సీ పర్వా లేదని పేర్కొంటూనే ఇలాంటి పిచ్ లు గనుక ఉంటే రాబోయే కాలంలో కష్టమన్నాడు.
ఒక నాయకుడి నాయకత్వ లక్షణాలు తెలియాలంటే టెస్టు మ్యాచ్ లు చూడాల్సి ఉంటుందన్నాడు. పిచ్ లు తయారు చేసే సమయంలో కెప్టెన్ ను సంప్రదించే సంప్రదాయం పీసీబీకి లేదని మండిపడ్డాడు సల్మాన్ భట్.
మొత్తం భారాన్ని కెప్టెన్ పై మోపితే ఫలితాలు రావడం కష్టమన్నాడు సల్మాన్ భట్(Salman Butt).
Also Read : వాళ్లందరి కంటే జో రూట్ సూపర్