Salman Khurshid : దేశాన్ని దోచుకు తింటున్న మోదీ

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఖుర్షీద్

Salman Khurshid : కేంద్ర మాజీ మంత్రి స‌ల్మాన్ ఖుర్షీద్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మోదీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల్లో గెలవ‌డం అంటే జ‌నాన్ని, దేశాన్ని దోచుకునేందుకు లైసెన్స్ ఇచ్చిన‌ట్లుగా మోదీ స‌ర్కార్ భావిస్తోందంటూ ఆరోపించారు.

ప్ర‌ధానిగా ఉన్న మోదీ దేశ ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టాడ‌ని పేర్కొన్నారు. కొద్ది మంది వ్యాపార‌వేత్త‌ల కోసం ఆయ‌న ప‌ని చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఇదేనా మ‌నం కోరుకున్న భార‌త దేశం అని ప్ర‌శ్నించారు స‌ల్మాన్ ఖుర్షీద్(Salman Khurshid). దేశంలో రోజు రోజుకు నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరుగుతున్నా మోదీ ప‌ట్టించు కోవడం లేద‌ని మండిప‌డ్డారు.

ఎన్నిక‌ల‌కు ముందు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించార‌ని కానీ ఇప్పుడు ఆయిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయ‌ని, ఇంకో వైపు గ్యాస్ ధ‌ర మంట మండుతోందంటూ వాపోయారు.

ఆయిల్ , గ్యాస్ కంపెనీల‌ను కంట్రోల్ చేయాల్సిన మోదీ , బీజేపీ ప‌రివారం ఎన్నిక‌ల్లో గెలుపు సంబురాల‌లో మునిగి పోయారంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

కొంద‌రిది కొంత కాలం మాత్ర‌మే న‌డుస్తుంద‌ని, ఆ త‌ర్వాత క‌నుమ‌రుగు కావ‌డం ఖాయ‌మ‌న్నారు. ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించ‌డంలో టాప్ లో కొన‌సాగుతున్నాడంటూ ఆరోపించారు స‌ల్మాన్ ఖుర్షీద్(Salman Khurshid).

ఇదిలా ఉండ‌గా దేశంలో బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ లేద‌ని అది ప‌బ్లిక్ లిమిటెడ్ కంపెనీలాగా త‌యారైంద‌ని ఫైర్ అయ్యారు. యుద్ధం పేరు చెప్పి కోట్లాది ప్ర‌జ‌ల‌పై ధ‌రా భారం మోప‌డం దారుణ‌మ‌న్నారు. ఏదో ఒక రోజు బీజేపీని ప్ర‌జ‌లు సాగ‌నంప‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : ఎన్నిక‌ల్లో బీజేపీకి మాయ‌వ‌తి స‌పోర్ట్

Leave A Reply

Your Email Id will not be published!