Samantha : తలపతి విజయ్ అంటే తమిళనాడులో యమ క్రేజ్. సన్ ఎంటర్మైనెంట్ నిర్మాణ సారథ్యంలో బీస్ట్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల మూవీ మేకర్స్ అరబిక్ కుతు పేరుతో సాంగ్ రిలీజ్ చేశారు.
ఓ వైపు మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట కళావతి పాటతో పాటు విజయ్ సాంగ్ కూడా పోటీ పడి ఆనందించారు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఈ రెండు పాటలను ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా మోస్ట్ పాపులర్ సాంగ్ గా పేరు తెచ్చుకున్న అరబిక్ కుతు సాంగ్ ను ప్రముఖ నటుడు శివ కార్తికేయర్ రాస్తే అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
ఈ పాటను అనిరుధ్ తో పాటు జొనిటా గాంధీ పాడారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా ఈ అరబిక్ కుతు సాంగ్ కు ప్రముఖ నటి సమంత(Samantha )రుతు ప్రభు డ్యాన్స్ చేసింది.
అది ఎక్కడో కాదు ఎయిర్ పోర్టులో . ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన సామ్ ఫోటోలతో పాటు వీడియో షేక్ చేస్తోంది. నెట్టింట్లో హల్ చల్ గా మారింది. అరబిక్ కుతు పాటకు విజయ్ తో పాటు ప్రముఖ నటి పూజా హెగ్డే దుమ్ము రేపారు.
అర్ధరాత్రి ఫ్లైట్ దిగాక విజయ్ బీస్ట్ పాటకు స్టెప్పులు వేసింది. ఆపై పాటను కూడా ఆలాపించింది. ప్రేమికుల రోజున విడుదలైన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. తనను ఈ పాట ఇంప్రెస్ చేసిందని సంతోషాన్ని వ్యక్తం చేసింది సమంత. ఇదిలా ఉండగా ఆమె నటించిన పుష్ప మూవీ సాంగ్ ఊ అంటావా మమా అన్న పాట దేశాన్ని ఊపేసింది.
మోస్ట్ పాపులర్ సాంగ్ గా నిలిచింది. సమంత ఇంతకు ముందు తలపతి విజయ్ తో నటించింది కూడా.
Also Read : సిద్దు నువ్వు లేని జీవితం వ్యర్థం