#Samantha : మేము అప్పటి వరకు స్నేహితులమే: సమంత

Samantha : టాలీవుడ్ యంగ్ గ్లామర్ బ్యూటీ సమంత గురించి మన అందరికీ తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా కొద్దీ తన అందాన్ని పెంచుకుంటూ పోతుంది ఈ అక్కినేని ముద్దుగుమ్మ. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ లతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. కాగా ఇటీవలే నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలో.. మేము అప్పటివరకు స్నేహితులమే అనే మాటతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

అక్కినేని కోడలు సమంత తన పెళ్లి తరువాత మరింత పాపులారిటీని పెంచుకుంటుంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన జిమ్ వీడియోలు, తన గార్డెనింగ్ వీడియోలు, మోడ్రన్ దుస్తులతో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూంటుంది. ఇటీవలే న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలను జరుపుకోవడానికి సమంత నాగ చైతన్య తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి, హర్ష రెడ్డి, ప్రీతమ్ రెడ్డి లతో గోవాలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు.

కాగా ఆ వేడుకలో తామంతా కలిసి దిగిన ఫోటోకు గత నాలుగేళ్ల క్రితం అదే స్నేహితుల తో దిగిన ఫోటోను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. పైగా ఆ ఫోటోతో ” వృద్ధాప్యం వరకు మేము మంచి స్నేహితులమని” అని తెలుపుతూ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది.

కాగా ప్రస్తుతం బుల్లితెరపై కనబడగా అహా లో సామ్..జామ్ అనే షో కు హోస్టింగ్ చేస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న “కాతువాకుల రేండు కాదల్” లో హీరోయిన్ గా నటిస్తుంది సమంత. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న “లవ్ స్టోరీ” సినిమాలో హీరోయిన్ సాయి పల్లవి తో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే.. అంతే కాకుండా ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధమని సినీ బృందం తెలిపారు.

No comment allowed please