Samatha Kumbh 2023 : దివ్య సాకేతం భ‌క్త జ‌న సందోహం

కొన‌సాగుతున్న సాకేత్ కుంభ్ ఉత్స‌వాలు

Samatha Kumbh 2023 : జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారి ఆధ్వ‌ర్యంలో స‌మ‌తా కుంభ్ 2023 ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వాలు(Samatha Kumbh 2023) ఈనెల 14 వ‌ర‌కు కొన‌సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన భ‌క్త బాంధ‌వుల‌తో పాటు దేశం న‌లుమూల‌ల నుంచి విదేశాల నుంచి భ‌క్తులు త‌రలి వ‌చ్చారు. స్వామి వారి ఆశీస్సులు పొందుతున్నారు. ఆయ‌న ఇచ్చే తీర్థ గోష్టికి పెద్ద ఎత్తున హాజ‌ర‌వుతున్నారు.

దివ్య సాకేత క్షేత్రం, స‌మ‌తా స్పూర్తి కేంద్రంలో భ‌క్తులు బారులు తీరారు. జై శ్రీ‌ర‌మ‌న్నారాయ‌ణ మూల మంత్రంతో మారు మ్రోగుతోంది ఆ ప్రాంతాల‌న్నీ. భ‌క్త బాంధ‌వులు అత్యంత నిష్ట‌తో శ్రీ విష్ణు స‌హ‌స్ర పారాయణం కొన‌సాగింది. ఫిబ్ర‌వ‌రి 10 శుక్ర‌వారం పూజ‌లు ప్రాంగ‌ణంలో ఘ‌నంగా కొన‌సాగాయి. ఉద‌యం 9. 30 గంట‌ల‌కు ప్ర‌త్యేక వేదిక‌పై సామూహిక ఉప‌న‌య‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

సాయంత్రం 6.00 గంట‌ల నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు గ‌జ వాహ‌న సేవ చేప‌ట్టారు. 18 గ‌రుడ సేవ‌లు నిర్వ‌హించారు. ఇదిలా ఉండ‌గా 11న శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌థోత్స‌వం, నిత్య పూర్ణ హార‌తి, చ‌క్ర స్నానం చేప‌డ‌తారు. 12న ఆదివారం ఉద‌యం 9 గంట‌ల‌కు సాంకేత రామ‌చంద్ర ప్ర‌భువుకు పూజ‌లు జ‌రుగుతాయి.

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు పుష్ప యాగం , దేవ‌తా ధ్యాన‌వ‌నం , మ‌హా పూర్ణ హార‌తి, ధ్వ‌జారోహ‌ణం ఉంటుంది. అనంత‌రం తీర్థ ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రుగుతుంది.

ఒక రోజు యాగ‌శాల‌లో కైంక‌ర్యం , 9 రోజుల పాటు కైంక‌ర్యం సౌక‌ర్యం ఉంటుంది. దివ్య దేశ‌మూర్తులు, రుత్వికుల‌కు వ‌స్త్రాలు స‌మ‌ర్పించే అవ‌కాశం, వాహ‌న సేవ‌, పుష్ప కైంక‌ర్యం, గోదానం, గోసేవ ఉంటుంది.

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు – టీటీడీ

Leave A Reply

Your Email Id will not be published!