Samatha Kumbh 2023 : విశ్వ శాంతి కోసం గీతా పారాయణం
దివ్య సాకేతంలో ఘనంగా రథోత్సవం
Samatha Kumbh 2023 : శంషాబాద్ ముచ్చింతల్ లోని దివ్య సాకేతం క్షేత్రంలో సమతా కుంభ్ 2023 ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రతిరోజూ నిర్దేశించిన మేరకు పూజలు, కైంకర్యాలు కొనసాగుతున్నాయి. జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున భక్త బాంధవులు హాజరయ్యారు. స్వామి కృప, ఆశీర్వాదం పొందుతూ ఆనందం పొందుతున్నారు.
సమతా కుంభ్ ఉత్సవాలు(Samatha Kumbh 2023) ఫిబ్రవరి 2న ప్రారంభం అయ్యాయి. ఈనెల 14 వరకు కొనసాగనున్నాయి. శుక్రవారం ప్రత్యేక వేదికపై సామూహిక ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటలకు గజ వాహన సేవ కొనసాగింది. 18 గరుడ సేవలు నిర్వహించారు.
శనివారం రోజు ఉదయం 9 గంటలకు రథోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. అనంతరం నిత్య పూర్ణ హారతి తో పాటు చక్ర స్నానం చేపట్టారు. అన్ని కార్యక్రమాలు జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో సమతా కుంభ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఇక ఉత్సవాలలో భాగంగా 12న ఆదివారం ఉదయం 9 గంటలకు సాకేత రామచంద్ర ప్రభువుకు దివ్య సాకేతంలో పూజలు జరుగుతాయి. మధ్యాహ్నం 3.00 గంటలకు పుష్ప యాగం , దేవతా ధ్యానవనం , మహా పూర్ణ హారతి, ధ్వజారోహణం ఉంటుంది. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది.
మరో వైపు ఉత్సవాలలో భాగంగా కైంకర్యాలు నిర్వహించే భాగ్యాన్ని జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు కల్పించారు. ఉత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు.
Also Read : మల్లన్న మహోత్సవాలు ప్రారంభం