Samatha Kumbh 2023 : దివ్య సాకేతం అంగ‌రంగ వైభోగం

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో

Samatha Kumbh 2023 : శంషాబాద్ ముచ్చింత్ లోని దివ్య సాకేత క్షేత్రం భ‌క్త జ‌న సందోహంతో నిండి పోయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌తో పాటు దేశం న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున భ‌క్త బాంధ‌వులు త‌ర‌లి వ‌చ్చారు. ఇక విదేశాలలో కూడా జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి వారికి శిష్యులు, భ‌క్తులు ఉన్నారు. వారు సైతం స‌మ‌తా స్పూర్తి కేంద్రంలో కొలువు తీరారు. దివ్య సాకేతం ప్రాంగ‌ణ‌లో స్వామి వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన‌సాగుతున్న పూజ‌ల‌లో పాల్గొంటున్నారు. స్వామి వారి కృప‌కు పాత్రులు అవుతున్నారు.

లోక క‌ళ్యాణం , స‌మ‌స్త మాన‌వ లోకం బాగుండాల‌ని కోరుతూ జ‌గ‌త్ గురువు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌మ‌తా కుంభ్ 2023 ఉత్స‌వాలు(Samatha Kumbh 2023) న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఉత్స‌వాలు ఈనెల 14 దాకా కొన‌సాగ‌నున్నాయి. ఇందులో భాగంగా నిన్న శుక్ర‌వారం 10న ప్ర‌త్యేక వేదిక‌పై సామూహిక ఉపన‌య‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంట‌ల దాకా గ‌జ వాహ‌న సేవతో పాటు 18 గ‌రుడ సేవ‌లు నిర్వ‌హించారు.

పూజా కార్య‌క్ర‌మాల‌లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 11న శ‌నివారం ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌థోత్స‌వం , నిత్య పూర్ణ హార‌తి , చ‌క్ర స్నానం , మ‌ధ్యాహ్నం విశ్వ శాంతి కోసం గీతా పారాయ‌ణ చేప‌ట్ట‌నున్నారు.

ఇక 12న ఆదివారం ఉద‌యం 9 గంట‌ల‌కు సాంకేత రామ‌చంద్ర ప్ర‌భువుకు దివ్య సాకేతంలో పూజ‌లు ఉంటాయి. మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు పుష్ప యాగం , దేవ‌తా ధ్యాన‌వ‌నం , మ‌హా పూర్ణ హార‌తి, ధ్వ‌జారోహ‌ణం ఉంటుంది. అనంత‌రం తీర్థ ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రుగుతుంది.

Also Read : దివ్య సాకేతం భ‌క్త జ‌న సందోహం

Leave A Reply

Your Email Id will not be published!