TDP MLA’s Suspensio : ఏపీ అసెంబ్లీలో మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇప్పటికే సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. సభా మర్యాదలను కాపాడాలని, మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తామని చెప్పారు.
అయినా తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు వినిపించు కోలేదు. దీంతో కొత్తగా ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్ పాస్ చేశారు. దీనికి స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవాళ సభ ప్రారంభమైన వెంటనే మరోసారి సభ్యులు అభ్యంతరం తెలిపారు.
స్పీకర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ వినిపించు కోలేదు. వారు నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. ఆందోళనకు దిగారు. విలువైన సభా సమయం పాడవుతుందని, అర్థం చేసుకుని సహకరించాలని స్పీకర్ కోరారు.
స్పీకర్ చైర్ ను, శాసనసభను అవమానించడమే పనిగా పెట్టుకున్నారంటూ వైసీపీ సభ్యులు మండిపడ్డారు. ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా, అంశాలు చర్చకు రాకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
దీంతో టీడీపీ సభ్యుల(TDP MLA’s Suspensio) ప్రవర్తన దారి తప్పడంతో స్పీకర్ హెచ్చరించారు. అయినా వినిపించుకోక పోవడంతో సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడారు. సభా గౌరవాన్ని మంట గలిపేందుకు కంకణం కట్టుకున్నారంటూ టీడీపీ సభ్యులపై(TDP MLA’s Suspensio) మండిపడ్డారు.
సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా ఇవాళ అసెంబ్లీలో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం కుదిపేసింది.
Also Read : రిజిస్ట్రేషన్లు సరే కేపిటల్ గెయిన్ సంగతేంటి?