Sangakkara Malinga : ఆ జ‌ట్టు స‌క్సెస్ వెనుక‌ ఆ ఇద్ద‌రు

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు వారే బ‌లం

Sangakkara Malinga : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2022 ఆఖ‌రి అంకానికి చేరింది. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఛాంపియ‌న్ లుగా నిలిచిన ముంబై ఇండియ‌న్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ ఇంటి బాట ప‌ట్టాయి.

ఇక కొత్త‌గా చేరిన రెండు జ‌ట్లు గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. టైటిల్ వేట‌లో నిలిచాయి. ఇక

ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్ నేతృత్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గురించి.

దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2021లో పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచింది. కానీ వ్య‌క్తిగ‌తంగా శాంస‌న్ భారీ స్కోర్ చేసి రాణించాడు.

ఈసారి బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో మ‌ళ్లీ శాంస‌న్ వైపు మొగ్గు చూపింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యం. ఇదిలా ఉండ‌గా గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా ఉండేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు శ్రీ‌లంక క్రికెట్ మాజీ దిగ్గ‌జ ఆటగాడు,

మిస్ట‌ర్ కూల్ గా పేరొందిన కుమార సంగ‌క్క‌ర‌(Sangakkara Malinga). అత‌డిని డైరెక్ట‌ర్ గా నియ‌మించింది యాజ‌మాన్యం. అంతే కాదు హెడ్ కోచ్ కూడా అత‌డే. మెల మెల్ల‌గా రాజ‌స్తాన్ లో ప్లేయ‌ర్ల ఆట తీరును పూర్తిగా మార్చేశాడు.

ఆ జ‌ట్టుపై ఎవ‌రూ అంచ‌నాలు పెట్టుకోలేదు. కానీ ఎలాంటి అంచ‌నాలు లేకుండానే బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఏకంగా

ప్లే ఆఫ్స్ లో 2వ స్థానంలో నిలిచింది.

అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అన్ని ఫార్మాట్ ల‌లో రాణిస్తోంది. కెప్టెన్ గా శాంస‌న్ స‌క్సెస్ అయినా ప‌రుగులు సాధించ‌డంలో

ఇంకా ప‌ర్ ఫెక్ట్ ఇన్సింగ్స్ ఆడ‌లేక పోయాడు.

ఇక బౌలింగ్ లో సైతం దుమ్ము రేపుతోంది రాజ‌స్తాన్. ఇక సంగ‌క్క‌ర‌తో(Sangakkara Malinga) పాటు బౌలింగ్ కు సంబంధించి కోచ్ గా శ్రీ‌లంక

దిగ్గ‌జ మాజీ పేస‌ర్ ల‌సిత్ మ‌ళింగ‌ను తీసుకుంది.

ఇప్పుడు ఆ జ‌ట్టు పూర్తి బ‌ల‌మైన టీమ్ గా త‌యారైంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ఈసారి టైటిల్ గెలిచినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేదు.

Also Read : ర‌స‌వ‌త్త‌ర పోరులో స‌క్సెస్ ఎవ‌రిదో

Leave A Reply

Your Email Id will not be published!