Sania Mirza : రేప‌టి త‌రానికి సానియా స్పూర్తి

ఆమె జీవితం నేర్పిన పాఠాలెన్నో

Sania Mirza Inspirational : ఒక మ‌హిళ 20 ఏళ్ల పాటు క్రీడా రంగంలో రాణించ‌డం మామూలు విష‌యం కాదు. మ‌హా అయితే 10 ఏళ్లు అంత‌కంటే వ‌రుస‌గా పాల్గొన‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సాధ్యప‌డ‌దు.

హైద‌రాబాద్ కు చెందిన టెన్నిస్ మ‌హరాణిగా పేరొందిన సానియా మీర్జా(Sania Mirza)  ఇక తాను ఆడ‌లేనంటూ ప్ర‌క‌టించింది. ఘ‌నంగా వీడ్కోలు కూడా తీసుకుంది. వంద‌ల కోట్ల బ్రాండ్ వాల్యూ క‌లిగిన ఈ టెన్నిస్ స్టార్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇదే స‌మ‌యంలో ఆమె త‌న క్రీడా జీవితంలో స‌క్సెస్ కావ‌డానికి ఎలాంటి ప‌ద్ద‌తులు అవ‌లంభించిందో చూడాలి.

నిన్న‌టి త‌రానికే కాదు నేటి, రేప‌టి త‌రానికి ఆమె స్పూర్తి దాయ‌కంగా నిలిచారు. సానియా మీర్జా చిన్న‌ప్ప‌టి నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించే దాకా స‌మ‌యాన్ని గుర్తించ‌డం. దానిని స‌ద్వినియోగం చేసుకోవ‌డం.

విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం. పైకి రావాలంటే క‌ష్ట‌ప‌డాల్సిందే. 41 వ‌రుస విజ‌యాలు అందుకోవ‌డం మామూలు విష‌యం కాదు. ఇది ఓ రికార్డ్ టెన్నిస్ ప‌రంగా. పూర్తిగా ఫిట్ గా ఉండ‌డం చాలా క‌ష్టం. వేలాది మంది ఆట‌ను చూస్తున్న‌ప్పుడు ఒత్తిడి ఉంటుంది. కానీ ఆడే ఆట‌ను ప్రేమిస్తే ఇబ్బంది ఉండ‌దు.

అందుకే చేస్తున్న ప‌నిని ప్రేమిస్తే క‌ష్టం అంటూ తెలియ‌ద‌ని పేర్కొంది. మారుతున్న ప‌రిస్థితుల‌ను కూడా అంచ‌నా వేసుకోవాలి. అప్పుడే మ‌నం గెలుపును చేజిక్కించు కోగ‌ల‌మ‌ని అంటోంది సానియా మీర్జా(Sania Mirza Inspirational) . మ‌న‌ల్ని మ‌నం ప్రేమించు కోవాలి. ఇదే స‌మ‌యంలో నీతో నువ్వు నిజాయితీగా ఉండాల‌ని తాను న‌మ్ముతాన‌ని సానియా చెబుతూ వ‌చ్చింది. ఎవ‌రైనా విజ‌యం సాధించాలంటే దేని లోనైనా కుటుంబ మ‌ద్ద‌తు చాలా అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెప్పింది.

Also Read : క్రియేటివిటీ సొంతం ‘దివ్యా’నందం

Leave A Reply

Your Email Id will not be published!