RBI Governor : ఆర్బీఐ నయా గవర్నర్ గా ‘సంజయ్ మల్హోత్రా’
సంజయ్ మల్హోత్రా ఐఐటీ కాన్పూర్ నుంచి ఇంజనీరింగ్ లో పట్టా పొందారు...
RBI : ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రాను నియమించారు. ఆయన పదవీ కాలం 3 సంవత్సరాల పాటు కొనసాగనుంది. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ 10 డిసెంబర్ 2023తో తన పదవీ కాలం ముగించనుండగా, ఆయన స్థానంలో మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
RBI New Governor..
సంజయ్ మల్హోత్రాను 2022లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీగా కేంద్రం ఆర్‌బీఐ డైరెక్టర్‌గా నామినేట్ చేసింది. సంజయ్ మల్హోత్రా(Sanjay Malhotra) రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి. 2020 నవంబర్‌లో REC (రీసోర్సెస్ ఎకనామికల్ కార్పొరేషన్) చైర్మన్, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. దీని ముందు, ఆయన ఇంధన మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.
సంజయ్ మల్హోత్రా ఐఐటీ కాన్పూర్ నుంచి ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. తర్వాత, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీను సంపాదించారు. గత 30 సంవత్సరాలుగా మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఐటీ, మైన్స్ వంటి విభాగాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2018లో ఉర్జిత్ పటేల్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో, ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. దాసు గడిపిన పదవీ కాలంలో, 2020లో కోవిడ్-19 కారణంగా దేశంలో ఎదురైన ద్రవ్యోల్బణం సమస్యను నియంత్రించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అయితే, ఆయన పదవీ కాలం పొడిగింపు పై ఎటువంటి చర్చలు ఇప్పటివరకు జరగలేదు.
Also Read : BJP Rajya Sabha MPs : రాజ్యసభ ఎంపీల లిస్ట్ విడుదల చేసిన బీజేపీ