Sanjay Manjrekar : భారత జట్టు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పేసర్ అర్ష్ దీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు.
వికెట్లు తీయక పోయినా బౌలర్ అన్నాక పరుగులు తక్కువ ఇవ్వడం ముఖ్యమని స్పష్టం చేశాడు. భారత జట్టుకు అర్ష్ దీప్ సింగ్ అవసరమని పేర్కొన్నాడు సంజయ్ మంజ్రేకర్. అర్ష్ దీప్ సింగ్ ను ఏకంగా మరో భారత క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ తో పోల్చాడు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో జాబితాలో అగ్ర స్థానంలోకి ఎగబాకింది. శిఖర్ ధావన్ , మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు.
ఇక జట్టులో కీలక పాత్ర పోషించింది మాత్రం ఓడియన్ స్మిత్. మనోడు 4 కీలక వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్ కూడా బౌలింగ్ లో రాణించడంతో జట్టు విజయం సులభంగా లభించింది.
అయితే పరుగులీయకుండా కట్టుదిట్టమైన బంతుల్ని విసిరాడు అర్ష్ దీప్. నాలుగు ఓవర్లు వేసిన సింగ్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చాడని తెలిపాడు సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar).
సూర్య కుమార్ యాదవ్ లాంటి హిట్టర్ కూడా సింగ్ బౌలింగ్ లో ఆడేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేశాడు. టీ20లో టాప్ బౌలర్లలో కచ్చితంగా ఐపీఎల్ లో భువీ తో పాటు అర్ష్ దీప్ సింగ్ కూడా ఉండడం ఖాయమన్నాడు సంజయ్ మంజ్రేకర్.
Also Read : డెవాల్ట్ బ్రెవిస్ రైజింగ్ స్టార్