Sanjay Manjrekar : ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అనుసరించిన పద్దతిని తీవ్రంగా తప్పు పట్టాడు భారత జట్టు మాజీ క్రికెటర్ , కామెంటేంటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar ). ప్రత్యర్థి జట్టు 193 పరుగుల భారీ టార్గెట్ ముందుంచింది.
ఈ తరుణంలో ఎలా రవిచంద్రన్ అశ్విన్ ను ముందుగా పంపించారంటూ నిలదీశాడు. ఓ వైపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు ఆధిపత్యం వహిస్తున్న సమయంలో నిలకడగా , వికెట్లును కాపాడుకుంటూ పరుగులు తీసే వాళ్లు క్రీజులో ఉండాలి.
కానీ బట్లర్ కు తోడుగా అశ్విన్ ఎలా సరిపోతాడని అనుకున్నారంటూ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ను, కెప్టెన్ సంజూ శాంసన్ ను నిలదీశాడు. పోనీ దేవదత్ పడిక్కల్ వరుసగా విఫలం అవుతూ వస్తున్నాడు.
ఈ తరుణంలో ఇంకొకరిని ప్రమోట్ చేయాలి. అప్పటికే సిట్యూయేషన్ రాజస్తాన్ వైపు లేదు. ఇదే క్రమంలో బాధ్యతగా ఆడాల్సిన కెప్టెన్ సంజూ శాంసన్ పై సీరియస్ అయ్యాడు మంజ్రేకర్. లేని పరుగు కోసం ఎందుకు పోవాల్సి వచ్చిందని మండిపడ్డాడు.
అద్భుతమైన బంతికి రనౌట్ గా వెనుదిరిగాడు శాంసన్. ఆయనతో పాటు ఆసిస్ మాజీ క్రికెటర్ బెన్ కూడా ఫైర్ అయ్యాడు. తలా తోకా లేని నిర్ణయం అంటూ ఫైర్ అయ్యాడు.
శాంసన్ కు బదులుగా అశ్విన్ రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. ఈ నిర్ణయాన్ని హాస్యాస్పదంగా పేర్కొన్నాడు. అతడిని పంపడం ద్వారా ఇబ్బందుల్లో ఉన్నట్లు గుజరాత్ కు తెలియ చేసినట్లయిందని తెలిపాడు.
Also Read : లాకీ ఫెర్గూసన్ సెన్సేషన్