Sanjay Raut : కోష్యారీ కామెంట్స్ రౌత్ సీరియస్
గవర్నర్ రాజీనామా చేస్తే బెటర్
Sanjay Raut : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో అధికారంలో ఉన్న శివసేన షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ గవర్నర్ తమకు వద్దంటూ ఆయనను వేరే రాష్ట్రానికి పంపించాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఇదే క్రమంలో శివసేన ఉద్దవ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(Sanjay Raut) తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోష్యారీ గవర్నర్ గా కంటే పాలిటిక్స్ లో బాగా రాణిస్తాడని ఎద్దేవా చేశారు.
ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న గవర్నర్ ఇలాంటి చౌక బారు, నీతి మాలిన కామెంట్స్ చేయడం దారుణమన్నారు. ఇంతలా దిగజారి మాట్లాడుతున్న కోష్యారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్ర సర్కార్ ను ప్రశ్నించారు. ఇకనైనా తన తప్పు తెలుసుకుని రాజీనామా చేస్తే గౌరవ ప్రదంగా ఉంటుందని సూచించారు.
వయస్సు పెరిగే కొద్దీ ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన గవర్నర్ తన పరిధిని దాటి మరాఠా యోధుడి గురించి చరిత్ర తెలుసు కోకుండా కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు సంజయ్ రౌత్. ఇదిలా ఉండగా భగత్ సింగ్ కోష్యారీ శివాజీని పలుమార్లు తూలనాడాడని ఆరోపించారు.
గవర్నర్ మాట్లాడాడా లేక ఆయన వెనుక ఉండి బీజేపీ మాట్లాడిస్తోందా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు శివసేన ఎంపీ.
Also Read : నేను ప్రమాదకరమైన నాయకుడిని కాను