Sanjay Raut Shinde : ప్ర‌పంచ ద్రోహుల దినంగా ప్ర‌క‌టించాలి

శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ డిమాండ్

Sanjay Raut Shinde : శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి , రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజ‌య్ రౌత్ నిప్పులు చెరిగారు. సీఎం షిండే, భార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏకంగా ఐక్య రాజ్య‌స‌మితికి ఓ లేఖ కూడా రాయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అదేమిటంటే గ‌త ఏడాది స‌రిగ్గా జూన్ 20న మ‌హా వికాస్ అఘాడీ సంకీర్ణ స‌ర్కార్ ను అక్ర‌మ ప‌ద్ద‌తుల్లో , అప్రజాస్వామికంగా కూల్చి వేశార‌ని ఆరోపించారు.

దీనికి న‌మ్మ‌క‌మైన బంటుగా ఉంటూనే కేవ‌లం అధికారం, ప‌ద‌వి కోసం త‌న‌ను నాయ‌కుడిని చేసిన శివ‌సేనకు వెన్ను పోటు పొడిచాడంటూ సీఎం ఏక్ నాథ్ షిండేపై మండిప‌డ్డారు. ఇందుకు సంబంధించి ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన మ‌రాఠా సంకీర్ణ స‌ర్కార్ ను కూల్చి వేసినందుకు షిండే , దేవేంద్ర ఫ‌డ్నవీస్ , మోదీ, అమిత్ షా ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీరి వ‌ల్ల‌నే త‌మ స‌ర్కార్ కూలి పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అందుకే ఐక్య రాజ్య స‌మితి వెంట‌నే జూన్ 20వ తేదీని ప్ర‌పంచ ద్రోహుల దినోత్స‌వంగా ప్ర‌క‌టించాల‌ని కోరారు. ఈ మేర‌కు త‌మ విన్న‌పాన్ని ద‌య‌తో అర్థం చేసుకుని మ‌న్నించాల‌ని విన్న‌వించారు సంజ‌య్ రౌత్(Sanjay Raut). ఆనాడు శివ‌సేన పార్టీ చీఫ్ , సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేను షిండే మోసం చేసి మ‌రాఠా ప్ర‌భుత్వ ప‌త‌నానికి కార‌ణ‌మైన రోజు ఈ రోజు అంటూ గుర్తు చేసుకున్నారు. అంతే కాదు జూన్ 21న ఐక్య రాజ్య‌స‌మితిలో జ‌రిగే యోగా సెష‌న్ కు హాజ‌రు కానున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి కూడా ట్యాగ్ చేయ‌డం విశేషం.

Also Read : Mudragada Padmanabham : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ముద్ర‌గ‌డ గ‌రం

Leave A Reply

Your Email Id will not be published!