Sanjay Raut : సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కు సంజ‌య్ రౌత్ క‌స్ట‌డీ

మ‌నీ లాండ‌రింగ్ లో స్పెష‌ల్ కోర్టు పొడిగింపు

Sanjay Raut : మ‌నీ లాండ‌రింగ్ కేసులో అరెస్ట్ చేసిన శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ క‌స్ట‌డీని సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కు పొడిగించింది. ఆగ‌స్టు 8న సంజ‌య్ రౌత్ ను 14 రోజుల క‌స్ట‌డీకి పంపించారు.

సోమ‌వారం ప్ర‌త్యేక పీఎంఎల్ఏ కోర్టు మ‌రికొన్ని రోజుల పాటు క‌స్ట‌డీని పొడిగించింది. ప‌త్రా చాల్ భూ కుంభ‌కోణంలో అరెస్ట్ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).

పాత్రా చాల్ రీ డెవ‌ల‌ప్ మెంట్ స్కామ్ లో రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ హౌసింగ్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ నుండి ప్ర‌వీణ్ రౌత్ అందుకున్న రూ. 112 కోట్ల‌లో సంజ‌య్ రౌత్(Sanjay Raut) , ఆయ‌న కుటుంబం రూ. 1.06 కోట్ల ప్ర‌త్య‌క్షంగా ల‌బ్ది పొందార‌ని ఈడీ త‌న నివేదికలో పేర్కొంది.

ఎంపీ సంజ‌య్ రౌత్ భార్య వ‌ర్షా రౌత్ కు చెందిన అవ‌ని ఇన్ ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ లో రూ 5,625 పెట్టుబ‌డిగా రూ. 13.94 ల‌క్ష‌లు అందుకున్న‌ట్లు చూపించార‌ని తెలిపింది.

ప్ర‌వీణ్ రౌత్ భార్య మాధురి పేరు మీద ఉంది ఆ సంస్థ‌. కాగా అరెస్ట్ కు ముందు ఈ కేసుకు సంబంధించి 60 ఏళ్ల సేన నాయ‌కుడిని ఈడీ ప్ర‌శ్నించింది. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా ఈడీ రెండు సార్లు స‌మ‌న్లు జారీ చేసింది.

దానికి ఆయ‌న అటెండ్ కాలేదు. దీంతో ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. అరెస్ట్ చేసి కోర్టులో హాజ‌రు ప‌రిచింది. ఆగ‌స్టు 1న సంజ‌య్ రౌత్ ను అరెస్ట్ చేశారు.

Also Read : ప‌రిష్క‌రించేంత దాకా కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తా

Leave A Reply

Your Email Id will not be published!